వర్తమానంపై పట్టు కోసం..

యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్నాను. వర్తమానాంశాలపై పట్టు సాధించాలంటే ఎలా సన్నద్ధం కావాలి?

Published : 07 Jun 2022 00:39 IST

యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్నాను. వర్తమానాంశాలపై పట్టు సాధించాలంటే ఎలా సన్నద్ధం కావాలి?

- ఎస్‌.ప్రమీల

* క్రమం తప్పకుండా వార్తా పత్రికలూ, సంపాదకీయ పేజీలో వచ్చే వ్యాసాలూ చదువుతూ మంచి నోట్స్‌ తయారు చేసుకోండి. కరెంట్‌ అఫైర్స్‌కు సంబంధించిన ప్రామాణిక వార/పక్ష/ మాస పత్రికలను కూడా చదవండి. ఇంటర్‌నెట్‌లో వర్తమానాంశాలను క్రోఢీకరించి అందించే వివిధ వెబ్‌సైట్లను సందర్శించి అక్కడ ఉన్న సమాచారాన్ని మీ నోట్సుతో సరిపోల్చి, నోట్స్‌ మెరుగుపర్చుకోండి. వీటితో పాటుగా ఇండియా ఇయర్‌ బుక్‌, మనోరమ ఇయర్‌ బుక్‌, ఎకనమిక్‌ సర్వే, మాతృభూమి ఇయర్‌ బుక్‌, కురుక్షేత్ర పత్రిక, యోజన, ప్రత్యోగిత దర్పణ్‌ కూడా తప్పకుండా చదవండి.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని