పరిశోధన చేయాలంటే...

పీహెచ్‌డీ చేయాలంటే ప్రవేశ పరీక్ష రాయాలా? తెలుగు రాష్ట్రాల్లోని అన్ని యూనివర్సిటీల్లోనూ దీని నియమాలు ఒకేవిధంగా ఉంటాయా?  

Published : 20 Oct 2022 00:32 IST

పీహెచ్‌డీ చేయాలంటే ప్రవేశ పరీక్ష రాయాలా? తెలుగు రాష్ట్రాల్లోని అన్ని యూనివర్సిటీల్లోనూ దీని నియమాలు ఒకేవిధంగా ఉంటాయా?  

- సచిన్‌

పరిశోధన చేయాలంటే సాధారణంగా ప్రవేశ పరీక్ష రాయాలి. యూజీసీ రెగ్యులేషన్స్‌ ప్రకారం యూజీసీ సీఎస్‌ఐఆర్‌ జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో, యూజీసీ/ సీఎస్‌ఐఆర్‌ నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (నెట్‌), స్టేట్‌ లెవెల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (స్లెట్‌), గేట్‌లో ఉత్తీర్ణులయిన వారికి ప్రవేశ పరీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోని యూనివర్సిటీల విషయానికొస్తే.. అన్ని విశ్వవిద్యాలయాల్లో ప్రవేశ పరీక్ష నియమాలు యూజీసీ నిబంధనలకు అనుగుణంగా దాదాపుగా ఒకేలా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని యూనివర్సిటీల్లో పీహెచ్‌డీ ప్రవేశానికి ఉమ్మడి పరీక్ష నిర్వహిస్తున్నారు. తెలంగాణ లోనూ ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని సెంట్రల్‌ యూనివర్సిటీల్లో పీహెచ్‌డీ అడ్మిషన్‌ కోసం ఆయా యూనివర్సిటీలు నిర్వహించే ప్రవేశపరీక్షలు రాయవలసి ఉంటుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని సెంట్రల్‌ యూనివర్సిటీలకూ కామన్‌ ఎంట్రన్స్‌ పరీక్ష పెట్టాలని ఆలోచిస్తున్నారు. పీహెచ్‌డీ ప్రవేశానికి ఇంటర్వ్యూ తప్పనిసరి. ఇంటర్వ్యూలో పరిశోధన అంశం, సబ్జెక్టులో విషయ పరిజ్ఞానం, పరిశోధన నైపుణ్యాలను పరిశీలిస్తారు. రాత పరీక్షలో వచ్చిన మార్కులకు ఇంటర్వ్యూ మార్కులు కలిపి మెరిట్‌ లిస్టు తయారుచేసి పీహెచ్‌డీలో ప్రవేశాలు కల్పిస్తారు.      

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు