విదేశీ డిగ్రీతో అవకాశాలుంటాయా?

కాలిఫోర్నియా యూనివర్సిటీలో ‘బిజినెస్‌ ఎకనామిక్స్‌’ చదవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాను. విదేశాల్లో ఈ కోర్సును చేసినవారికి మన దేశంలో ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి?

Published : 22 Nov 2022 00:21 IST

కాలిఫోర్నియా యూనివర్సిటీలో ‘బిజినెస్‌ ఎకనామిక్స్‌’ చదవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాను. విదేశాల్లో ఈ కోర్సును చేసినవారికి మన దేశంలో ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి?

- సాగర్‌

విదేశాల్లో విద్యను అభ్యసించడం శ్రేయస్కరమే కానీ, ఆ విదేశీ డిగ్రీలతో మంచి వేతనంతో మనదేశంలో ఉద్యోగం పొందటం అనేది ఒక సవాలే! యూఎస్‌ లాంటి పాశ్చాత్య దేశాల్లో బిజినెస్‌ ఎకనామిక్స్‌ కోర్సు చదివినవారికి ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌ చదివినవారితో సమాన ఉద్యోగావకాశాలూ, వేతనాలూ, హోదా ఉంటాయి. మనదేశంలో కూడా ఇటీవలికాలంలో బిజినెస్‌ ఎకనామిక్స్‌కు డిమాండ్‌ క్రమంగా పెరుగుతోంది. కానీ ఈ ఉద్యోగావకాశాలన్నీ ప్రైవేటు వ్యాపార సంస్థల్లో, మల్టీనేషనల్‌ కంపెనీల్లో, అంతర్జాతీయ బ్యాంకుల్లో ఉంటున్నాయి. మీరు బిజినెస్‌ ఎకనామిక్స్‌ డిగ్రీతో పాటు బిజినెస్‌ అనలిటిక్స్‌, డేటా సైన్స్‌ లాంటి కోర్సులను కూడా చేసినట్లయితే మనదేశంలో మీ ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి. మీరు కాలిఫోర్నియా యూనివర్సిటీలోనే క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా మల్టీనేషనల్‌ కంపెనీల్లో/ అంతర్జాతీయ బ్యాంకుల్లో ఉద్యోగం పొంది, బదిలీపై మనదేశానికి వచ్చినట్లయితే మంచి వేతనం లభిస్తుంది. చదువు పూర్తయ్యాక రెండు/ మూడేళ్లు యూఎస్‌లోనే ఉద్యోగం చేసి, ఆ ఉద్యోగానుభవంతో మనదేశంలో ఉద్యోగాల కోసం ప్రయత్నించండి. బిజినెస్‌ ఎకనామిక్స్‌ డిగ్రీతో మనదేశంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, నీతి ఆయోగ్‌ లాంటి ప్రభుత్వ సంస్థల్లోనూ ఉద్యోగాలకోసం ప్రయత్నించవచ్చు. బోధనపై ఆసక్తి ఉంటే యూఎస్‌లోనే పీహెచ్‌డీ కూడా చేసినట్లయితే మనదేశంలో ఐఐటీ, ఐఐఎం లాంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో, ప్రముఖ ప్రైవేటు యూనివర్సిటీల్లో అధ్యాపక ఉద్యోగాలు పొందే అవకాశముంది.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని