స్పోర్ట్స్‌ ట్రైనర్‌ అవ్వాలంటే?

ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌లో పీజీ (ఎంపీఈడీ) చేశాను. స్పెషలైజేషన్‌ కోసం సర్టిఫికెట్‌ కోర్సును ఆస్ట్రేలియాలో చేయాలనుంది.

Published : 29 Nov 2022 00:47 IST

ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌లో పీజీ (ఎంపీఈడీ) చేశాను. స్పెషలైజేషన్‌ కోసం సర్టిఫికెట్‌ కోర్సును ఆస్ట్రేలియాలో చేయాలనుంది. అక్కడి ఏ యూనివర్సిటీలో ‘ఫార్మల్‌ స్పోర్ట్స్‌ ట్రైనర్‌’ కోర్సులు ఉంటాయి?

కరుణాకర్‌

త కొన్ని సంవత్సరాలుగా ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ చేసినవారికి ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. మనదేశంలో ఫిట్‌నెస్‌ పరిశ్రమ, క్రీడా రంగాల్లో నిపుణుల కొరత ఎక్కువగానే ఉంది. విదేశాల్లో స్పోర్ట్స్‌కు సంబంధించిన చాలా ప్రత్యేకమైన కోర్సులున్నాయి. ఆస్ట్రేలియాలో ఫార్మల్‌ స్పోర్ట్స్‌ ట్రైనర్‌ కోర్సుల్ని డీకేన్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ సిడ్నీ, గ్రిఫిత్‌ యూనివర్సిటీ, లా ట్రోబే యూనివర్సిటీ, వెస్టర్న్‌ సిడ్నీ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ క్వీన్స్‌ లాండ్‌ లాంటి ప్రముఖ విద్యా సంస్థలు అందిస్తున్నాయి. కెరియర్‌ విషయానికొస్తే స్పోర్ట్స్‌ కోర్సుల్లో శిక్షణ పొందినవారికి ఫిట్‌నెస్‌ ఇన్‌స్ట్రక్టర్‌, పర్సనల్‌ ట్రైనర్‌, స్పోర్ట్స్‌ కోచ్‌, అవుట్‌డోర్‌ రిక్రియేషన్‌ గైడ్‌, స్పోర్ట్స్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌, రిక్రియేషన్‌ ఆఫీసర్‌, లీజర్‌ సర్వీసెస్‌ ఆఫీసర్‌ లాంటి హోదాలతో కొలువులు లభిస్తాయి. ఈ రంగంలో కొంత అనుభవం గడించాక అంతర్జాతీయ ప్రమాణాలతో సొంతంగా ఫిట్‌నెస్‌ సంస్థనూ ప్రారంభించవచ్చు.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని