బీఈడీతో పాటు మరో కోర్సు చేయొచ్చా

గ్రాడ్యుయేషన్‌ తర్వాత బీఈడీ, మాస్టర్స్‌ ఒకే సంవత్సరంలో చదవాలనుకుంటున్నా. ఇలా చేస్తే ఏమైనా సమస్య వస్తుందా? యూజీసీ ఈ అవకాశం కల్పిస్తోందని విన్నాను.

Published : 06 Apr 2023 00:13 IST

గ్రాడ్యుయేషన్‌ తర్వాత బీఈడీ, మాస్టర్స్‌ ఒకే సంవత్సరంలో చదవాలనుకుంటున్నా. ఇలా చేస్తే ఏమైనా సమస్య వస్తుందా? యూజీసీ ఈ అవకాశం కల్పిస్తోందని విన్నాను. వాస్తవమేనా?

- ఎ.మహేష్‌

యూజీసీ మార్గదర్శకాల ప్రకారం ఒకే సమయంలో రెండు డిగ్రీలు/ పీజీలు ఒకటి రెగ్యులర్‌గా, మరొకటి రెగ్యులర్‌/ఆన్‌లైన్‌/ డిస్టెన్స్‌/ ఓపెన్‌ పద్ధతిలో చదివే అవకాశం ఉంది. డిగ్రీ/పీజీతోపాటు డిప్లొమా/ సర్టిఫికెట్‌ కోర్సులు చేసే వెసులుబాటు గతంలో కూడా ఉంది. కానీ బీఈడీ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సు నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ అనే రెగ్యులేటరీ సంస్థ (ఎన్‌సీటీఈ) నియంత్రణలో ఉంది. ఇప్పటివరకైతే ఎన్‌సీటీఈ వారు బీఈడీతో పాటు మరో కోర్సు చేసే విషయంలో ఎలాంటి మార్గదర్శకాలూ విడుదల చేయలేదు. కాబట్టి మీరు బీఈడీ కోర్సు చేసే సమయంలో మరో కోర్సు చేయకపోవడమే శ్రేయస్కరం.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు