కోర్సులు చేశాను కానీ..

ఈసేవా సెంటర్‌లో ఎగ్జిక్యూటివ్‌గా కెరియర్‌ మొదలుపెట్టి మూడు కంపెనీలు మారాను. ఇప్పుడు 12 ఏళ్లుగా ఒకే కంపెనీలో పనిచేస్తున్నా. ఈ సమయంలోనే ఎంబీఏ ఫైనాన్స్‌, పీజీడీఎస్‌సీఎం పూర్తిచేశా.

Published : 12 Apr 2023 00:39 IST

ఈసేవా సెంటర్‌లో ఎగ్జిక్యూటివ్‌గా కెరియర్‌ మొదలుపెట్టి మూడు కంపెనీలు మారాను. ఇప్పుడు 12 ఏళ్లుగా ఒకే కంపెనీలో పనిచేస్తున్నా. ఈ సమయంలోనే ఎంబీఏ ఫైనాన్స్‌, పీజీడీఎస్‌సీఎం పూర్తిచేశా. కానీ ఈ డిగ్రీలతో ఎలాంటి ఉద్యోగావకాశాలూ రావడం లేదు. ఇప్పుడు ఉద్యోగం మారాలనుకుంటున్నా. ఏం చేయాలి?        

పి. మధుసూదన్‌రావు

* మీరు 12 సంవత్సరాలుగా పనిచేస్తున్న కంపెనీ గురించీ, అక్కడ నిర్వహిస్తున్న బాధ్యతల గురించీ చెప్పలేదు. మీరు ఎంబీఏ ఫైనాన్స్‌, పీజీ డిప్లొమా ఇన్‌ సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు ఏ యూనివర్సిటీ నుంచి చేశారో! సాధారణంగా ఉద్యోగం చేస్తూ ఎంబీఏ లాంటి కోర్సులు చేసినవారికి కొత్త కొలువు పొందడంలో వారి గత ఉద్యోగానుభవం చాలా ఉపయోగపడుతుంది. మీరు ప్రస్తుతం పనిచేస్తున్న రంగంలోనే ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. ఎంబీఏ లాంటి కోర్సుల్లో మార్కులకంటే నైపుణ్యాలు చాలా ముఖ్యం. ఉద్యోగ ప్రయత్నాలపై మీరు ఎంబీఏ డిగ్రీ పొందిన యూనివర్సిటీ విశ్వసనీయత చాలా ప్రభావం చూపుతుంది. ప్రస్తుత ఉద్యోగ మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా మీ నైపుణ్యాలను మెరుగుపర్చుకోండి. ఉద్యోగం చేయాలనుకుంటున్న కంపెనీలో పనిచేస్తున్న సీనియర్‌ ఉద్యోగుల ద్వారా మరిన్ని వివరాలు సేకరించి, దానికి అనుగుణంగా నైపుణ్యాలు పెంపొందించుకోండి. నిరుత్సాహపడకుండా ఉద్యోగ ప్రయత్నాలు చేయండి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు