డిప్లొమా, డిగ్రీ ఒకే ఏడాది

ఈసీఈ డిప్లొమా 2012-2015 బ్యాచ్‌ నాది. ఆరోగ్య సమస్యల కారణంగా మార్చి/ఏప్రిల్‌ 2019లో పూర్తిచేశాను. ఈలోగా కాకతీయ యూనివర్సిటీలో ఎస్‌డీఎల్‌సీఈ బీకామ్‌ (కంప్యూటర్‌) చదివి అక్టోబరు 2019లో పాసయ్యాను.

Published : 13 Apr 2023 00:03 IST

ఈసీఈ డిప్లొమా 2012-2015 బ్యాచ్‌ నాది. ఆరోగ్య సమస్యల కారణంగా మార్చి/ఏప్రిల్‌ 2019లో పూర్తిచేశాను. ఈలోగా కాకతీయ యూనివర్సిటీలో ఎస్‌డీఎల్‌సీఈ బీకామ్‌ (కంప్యూటర్‌) చదివి అక్టోబరు 2019లో పాసయ్యాను. డిప్లొమా, డిగ్రీ ఒకే సంవత్సరంలో పాస్‌ కావడం వల్ల ఉద్యోగ విషయంలో సమస్యలు వస్తున్నాయి.

ఆర్‌.సాయికిరణ్‌

కే సమయంలో రెండు డిగ్రీలు చేసే వెసులుబాటును యూజీసీ 2022 నుంచి కల్పించింది. ఈ వెసులుబాటు 2022 తరువాత చేసే డిగ్రీలకు మాత్రమే. 2019లో డిగ్రీ, డిప్లొమా పూర్తిచేశారు కాబట్టి, ఒకే సమయంలో పొందిన రెండు సర్టిఫికెట్ల విషయంలో సమస్యలు వస్తున్నాయి. మీరు 2012-15లో రెగ్యులర్‌గా కాలేజీకి వెళ్లి, ఆ తరువాత సప్లిమెంటరీలో డిప్లొమా పరీక్షలు ఉత్తీర్ణులై, 2016 నుంచి 2019 వరకు డిగ్రీని దూరవిద్యలో పూర్తి చేసివుంటే మీ సమస్య కొంతమేరకు పరిష్కారమైనట్లే! అలా కాకుండా డిప్లొమా రెగ్యులర్‌గా చేస్తూనే, డిగ్రీ కూడా అదే సమయంలో చేసుంటే సర్టిఫికెట్ల గుర్తింపు విషయంలో సమస్యలు వస్తాయి. ఇప్పుడు మీకు 3 మార్గాలున్నాయి. మొదటిది- డిప్లొమా రెగ్యులర్‌గా, డిగ్రీ దూరవిద్యలో చేశారు కాబట్టి, రెండింటినీ గుర్తించమని ఉద్యోగ నియామక సంస్థను అభ్యర్థించడం. రెండోది- ఏదో ఒక సర్టిఫికె ట్‌తో మాత్రమే ఉద్యోగ ప్రయత్నాలు చేయడం. మూడోది- డిప్లొమా విద్యార్హతతో ఇంజినీరింగ్‌ లేదా డిగ్రీ విద్యార్హతతో ఎంకాం/ ఎంబీఏ/ బీఈడీ…/ జర్నలిజం/ ఎల్‌ఎల్‌బీ లాంటి కోర్సులను చేసే ప్రయత్నం చేయడం.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని