స్పీచ్‌ థెరపిస్ట్‌ అవ్వాలంటే...?

స్పీచ్‌ థెరపిస్ట్‌గా స్థిరపడాలంటే ఏ కోర్సు చదవాలి? అది ఏ సంస్థల్లో ఉంది? ఆటిజం, డిస్లెక్సియాలాంటి ప్రత్యేక అవసరాలున్న పిల్లల కోసం ప్రభుత్వ పాఠశాలలు ఎక్కడున్నాయి?

Updated : 19 Apr 2023 06:37 IST

స్పీచ్‌ థెరపిస్ట్‌గా స్థిరపడాలంటే ఏ కోర్సు చదవాలి? అది ఏ సంస్థల్లో ఉంది? ఆటిజం, డిస్లెక్సియాలాంటి ప్రత్యేక అవసరాలున్న పిల్లల కోసం ప్రభుత్వ పాఠశాలలు ఎక్కడున్నాయి?

కె.హరనాథ్‌

స్పీచ్‌ థెరపిస్ట్‌ అవ్వాలంటే మూడు సంవత్సరాల వ్యవధి ఉన్న బీఎస్సీ ఆడియాలజీ అండ్‌ స్పీచ్‌ లాంగ్వేజ్‌ పెథాలజీ కోర్సు చేయాలి. ఈ కోర్సు అలీ యవార్‌ జంగ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌ డిజేబిలిటీస్‌ సికింద్రాబాద్‌, ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌ మైసూరు, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ చండీఘర్‌, ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ న్యూడిల్లీ, బాంబే యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ మైసూర్‌, మణిపాల్‌ యూనివర్సిటీ, అమిటి యూనివర్సిటీ నోయిడా, క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజ్‌ వెల్లూర్‌, భారతీ విద్యాపీఠ్‌ పుణెే లాంటి విద్యాసంస్థల్లో ఉంది. ఆటిజం, డిస్లెక్సియా లాంటి ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు ప్రత్యేక ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులో లేవు. కానీ, ఏ ప్రభుత్వ పాఠశాల కూడా ఇలాంటి పిల్లలకు అడ్మిషన్‌ని నిరాకరించకూడదు. కానీ చాలా  ప్రభుత్వ పాఠశాలల్లో వీరి ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా బోధించే ఉపాధ్యాయుల లేమి, వారికి అవసరమైన ప్రత్యేక బోధనా పరికరాల కొరత ఉంది.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు