పీజీలో ఏ కాంబినేషన్‌ మేలు?

కెమిస్ట్రీ చేశాను. తర్వాత ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ చదవడం మంచిదేనా? లేదా ఇతర కాంబినేషన్లతో ఎంఎస్సీ చేయడం మేలా?

Published : 24 Apr 2023 00:15 IST

బీఎస్సీ బయో

కెమిస్ట్రీ చేశాను. తర్వాత ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ చదవడం మంచిదేనా? లేదా ఇతర కాంబినేషన్లతో ఎంఎస్సీ చేయడం మేలా?

శ్రీనివాస్‌

* బీఎస్సీ బయోకెమిస్ట్రీ తరువాత, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ చేసే అవకాశం ఉంది. ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ చేసినవారికి కార్పొరేట్‌ హాస్పిటల్స్‌, బయోటెక్‌ కంపెనీలు, ఫుడ్‌ అండ్‌ బేవరెజెస్‌ ఇండస్ట్రీలు, రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌, ఫార్మా, కెమికల్‌, ఫోరెన్సిక్‌, హెల్త్‌ కేర్‌ సంస్థల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. మీకు బోధన రంగంపై ఆసక్తి ఉంటే జూనియర్‌/ డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకులుగా పనిచేయవచ్చు. బయోకెమిస్ట్రీలో పీహెచ్‌డీ చేసి, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా/పరిశోధన సంస్థల్లో శాస్త్రవేత్తలుగా స్థిరపడవచ్చు. ఎంఎస్సీలో బయోకెమిస్ట్రీ కాకుండా దీనికి అనుబంధంగా ఉన్న మైక్రో బయాలజీ, బయోటెక్నాలజీ, బయో ఇన్ఫర్మాటిక్స్‌, సిస్టమ్స్‌ బయాలజీ, ప్లాంట్‌ బయాలజీ, యానిమల్‌ బయాలజీ, బయోమెడికల్‌, బయో ఫిజిక్స్‌, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌, టాక్సికాలజీ, ఇమ్యునాలజీ లాంటి సబ్జెక్టులు కూడా చదవొచ్చు. పైన పేర్కొన్న అన్ని కోర్సులకూ ఉద్యోగావకాశాలు బాగుంటాయి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని