ఏ కోర్సు మెరుగైనది?

మా సోదరి ఇంటర్‌ (బైపీసీ) పాసై ఎంసెట్‌ రాసింది. కోర్సు పూర్తికాగానే వెంటనే ఉద్యోగం రావాలంటే నర్సింగ్‌/ బీ.ఫార్మసీ/ అగ్రికల్చర్‌.. వీటిల్లో దేన్ని ఎంచుకుంటే మంచిది?

Published : 06 Jun 2023 00:09 IST

మా సోదరి ఇంటర్‌ (బైపీసీ) పాసై ఎంసెట్‌ రాసింది. కోర్సు పూర్తికాగానే వెంటనే ఉద్యోగం రావాలంటే నర్సింగ్‌/ బీ.ఫార్మసీ/ అగ్రికల్చర్‌.. వీటిల్లో దేన్ని ఎంచుకుంటే మంచిది?

మధుకిరణ్‌

దువు పూర్తవ్వగానే త్వరగా ఉద్యోగం పొందే కోర్సుల కంటే జీవితకాలం ఇష్టంగా కెరియర్‌ కొనసాగించగలిగే కోర్సును ఎంచుకోవడం మేలు. చాలా సందర్భాల్లో త్వరగా ఉద్యోగం పొందినవారికి వారు చేస్తున్న ఉద్యోగాలపై ఆసక్తి లేక తరచూ చేసే పని మారడం  చూస్తున్నాం. ఇంటర్‌ బైపీసీ చేసినవారు త్వరగా ఉద్యోగం పొందాలంటే బీఎస్సీ నర్సింగ్‌ ఉత్తమ మార్గం. నైపుణ్యం, సేవ చేయాలన్న ఆకాంక్ష ఉన్న నర్సులకు కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో, విదేశాల్లో చాలా డిమాండ్‌ ఉంది. రోజురోజుకూ పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు, ఆరోగ్య సంబంధిత అంశాల మూలంగా వైద్య, ఆరోగ్య రంగాల్లో కొలువుల అవసరం పెరుగుతోంది. నర్సింగ్‌ కోర్సు చదివినవారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

బైపీసీ చదివినవారికి మరో ప్రత్యామ్నాయం- బీ ఫార్మసీ. ఫార్మసీ రంగం కూడా వైద్య, ఆరోగ్య రంగాలకు సంబంధించిన విభాగం అవ్వడం వల్ల ఈ రంగంలోనూ ఉద్యోగావకాశాలు మెరుగ్గానే ఉన్నాయి. ఫార్మసీ కోర్సు చదివినవారికి ఫార్మాస్యూటికల్‌ కంపెనీల్లో, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైద్యశాలల్లో, ప్రైవేటు ఫార్మసీ రిటైల్‌ అవుట్‌లెట్‌ల్లో అవకాశాలుంటాయి.

అగ్రికల్చర్‌ బీఎస్సీ చదివితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రభుత్వ బ్యాంకుల్లో, విత్తన సంస్థల్లో, ఫెర్టిలైజర్‌, పెస్టిసైడ్‌ కంపెనీల్లో, వ్యవసాయ పరికరాలు తయారుచేసే సాంకేతిక, స్వచ్ఛంద సంస్థల్లో ఉపాధి లభిస్తుంది. ఇవేకాకుండా మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ, న్యూట్రిషన్‌, బీబీఏ, హోటల్‌ మేనేజ్‌మెంట్‌, టూరిజం మేనేజ్‌మెంట్‌, ఐదు సంవత్సరాల ఎల్‌ఎల్‌బీ లాంటి కోర్సుల గురించీ ఆలోచించవచ్చు.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని