ప్రభుత్వ ఉద్యోగం ఎలా?

ఎమ్మెస్సీ (కంప్యూటర్‌ సైన్స్‌) చేస్తున్నాను. నాకు ప్రభుత్వోద్యోగం చేయాలనుంది. ఈ అర్హతతో ఏ పోటీ పరీక్షలు రాయొచ్చు?

Published : 20 Jun 2023 00:16 IST

ఎమ్మెస్సీ (కంప్యూటర్‌ సైన్స్‌) చేస్తున్నాను. నాకు ప్రభుత్వోద్యోగం చేయాలనుంది. ఈ అర్హతతో ఏ పోటీ పరీక్షలు రాయొచ్చు?

ఎం. రాజేష్‌

మ్మెస్సీ (కంప్యూటర్‌ సైన్స్‌) చేసినవారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ రకాలైన ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు.. కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌, సిస్టమ్స్‌ అనలిస్ట్‌, సిస్టమ్స్‌ మేనేజర్‌, సిస్టమ్స్‌ అడ్మినిస్ట్రేటర్‌, నెట్‌వర్క్‌ ఇంజినీర్‌, కంప్యూటర్‌ సైంటిస్ట్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌, ఐటీ ఆఫీసర్‌, ఐటీ కన్సల్టెంట్‌, కంప్యూటర్‌ అసోసియేట్‌..ఇలాంటివి. ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు ప్రభుత్వరంగ సంస్థలైన బీహెచ్‌ఈఎల్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎన్‌ఎండిసీ, కోల్‌ ఇండియా, ఎన్టీపీసీ, భారత్‌ పెట్రోలియం, సెయిల్‌, గెయిల్‌ లాంటి మరెన్నో సంస్థల్లో పైన పేర్కొన్న ఉద్యోగాలున్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో కూడా ఐటీ కొలువులు ఉంటాయి. ఈ సంస్థలన్నీ ప్రత్యేకమైన ఉద్యోగ నోటిఫికేషన్‌ల ద్వారా నియామకాలు చేపడుతున్నాయి.
మీకు బోధన రంగంపై ఆసక్తి ఉంటే జవహర్‌ నవోదయ/ కేంద్రీయ విద్యాలయ లాంటి సంస్థల్లో కంప్యూటర్‌ టీచర్‌ ఉద్యోగాలకోసం ప్రయత్నించవచ్చు. ఆయా సంస్థల వెబ్‌సైట్‌లను తరచుగా సందర్శిస్తూ ఉద్యోగ ప్రకటన వచ్చినప్పుడు, దరఖాస్తు చేసుకోండి.  అవసరమైన పరీక్ష రాసి ఇంటర్వ్యూ ద్వారా ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి ప్రయత్నించండి. సాధారణంగా ప్రభుత్వ సంస్థల్లో కంప్యూటర్‌/ఐటీ ఉద్యోగాలు తక్కువ సంఖ్యలో ఉంటాయి. ఆ తక్కువ ఉద్యోగాలకు ఎమ్మెస్సీ (కంప్యూటర్‌ సైన్స్‌) చేసినవారితో పాటు, ఎంసీఏ, బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ చేసినవారూ దరఖాస్తు చేస్తుండటం వల్ల పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలోపు ప్రైవేటు ఉద్యోగాల కోసం కూడా ప్రయత్నించి ఉద్యోగానుభవాన్ని పొందండి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు