ఎంఎల్‌ఐఎస్‌సీ చదివితే...?

ఎంఎల్‌ఐఎస్‌సీ (మాస్టర్‌ ఆఫ్‌ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌) చదువుతున్నాను. ఈ కోర్సుతో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు, విదేశాల్లో ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి?

Published : 21 Jun 2023 00:49 IST

ఎంఎల్‌ఐఎస్‌సీ (మాస్టర్‌ ఆఫ్‌ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌) చదువుతున్నాను. ఈ కోర్సుతో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు, విదేశాల్లో ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి?
 కె.రామకృష్ణ

ఎంఎల్‌ఐఎస్‌సీ చదివినవారికి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో, డిగ్రీ కళాశాలల్లో, యూనివర్సిటీల్లో వివిధ రకాలైన లైబ్రేరియన్‌ ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి. యూనివర్సిటీల్లో అయితే.. ప్రొఫెషనల్‌ అసిస్టెంట్‌, లైబ్రరీ అటెండెంట్‌, లైబ్రరీ అసిస్టెంట్‌, జూనియర్‌ లైబ్రేరియన్‌, అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌, డిప్యూటీ లైబ్రేరియన్‌, లైబ్రేరియన్‌ లాంటి  చాలా ఉద్యోగాలకు మీరు అర్హులవుతారు. వీటితో పాటుగా ఆర్కైవిస్ట్‌, ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌ డైరెక్టర్‌, రికార్డ్‌ మేనేజర్‌, డాక్యుమెంటేషన్‌ ఆఫీసర్‌ లాంటి ఉద్యోగాల గురించి కూడా ఆలోచించవచ్చు. బ్యాంకుల్లో, మ్యూజియాల్లో కూడా లైబ్రరీ సైన్స్‌ చదివినవారికి పరిమిత సంఖ్యలో అవకాశాలుంటాయి.
బోధన రంగంపై ఆసక్తి ఉంటే లైబ్రరీ సైన్స్‌లో పీహెచ్‌డీ చేసి, అధ్యాపక ఉద్యోగాలకోసం ప్రయత్నించవచ్చు. విదేశాల్లో కూడా దాదాపుగా పైన పేర్కొన్న ఉద్యోగాలన్నీ అందుబాటులో ఉంటాయి. ప్రైవేటు రంగానికొస్తే - యూనివర్సిటీల్లో, కళాశాలల్లో లైబ్రేరియన్‌ ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి. లైబ్రరీ సైన్స్‌ చదివినవారికి మీడియా రంగంలోనూ ఉపాధికి వీలుంటుంది. లైబ్రరీ సైన్స్‌ పరిజ్ఞానంతో పాటు, కొంత ఐటీ పరిజ్ఞానం కూడా పెంపొందించుకొంటే ఇన్ఫర్మేషన్‌ అనలిస్ట్‌, ఇన్ఫర్మేషన్‌ ఆర్కిటెక్ట్‌ లాంటి ఉద్యోగాలకు అర్హులవుతారు.
ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని