నోటిఫికేషన్స్

యూపీ రాష్ట్రం అమేథిలోని ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉరాన్‌ అకాడమీ 2023-24 విద్యాసంవత్సరానికి ఎయిర్‌క్రాఫ్ట్‌ మెయింటెనెన్స్‌ ఇంజినీరింగ్‌లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Published : 21 Jun 2023 01:01 IST

ప్రవేశాలు

ఐజీఆర్‌యూఏలో ఎయిర్‌క్రాఫ్ట్‌ మెయింటెనెన్స్‌ ఇంజినీరింగ్‌
యూపీ రాష్ట్రం అమేథిలోని ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉరాన్‌ అకాడమీ 2023-24 విద్యాసంవత్సరానికి ఎయిర్‌క్రాఫ్ట్‌ మెయింటెనెన్స్‌ ఇంజినీరింగ్‌లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఎయిర్‌క్రాఫ్ట్‌ మెయింటెనెన్స్‌ ఇంజినీరింగ్‌ ప్రోగ్రామ్‌: 30 సీట్లు
అర్హత: అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుంచి 10+2 (ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌) లేదా డిప్లొమా (ఏరోనాటికల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 17 సంవత్సరాలు నిండి ఉండాలి.
ఎంపిక: 10+2/ డిప్లొమాలో సాధించిన మార్కుల ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 30-06-2023.
వెబ్‌సైట్‌: https://igrua.gov.in/ 
 


ఎన్‌ఐటీసీ ఇండియాలో క్రాఫ్ట్‌మెన్‌ ట్రైనింగ్‌ స్కీమ్‌
న్యూదిల్లీలోని మినిస్ట్రీ ఆఫ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌, నేషనల్‌ ఇండస్ట్రియల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ క్రాఫ్ట్‌మెన్‌ ట్రైనింగ్‌ స్కీమ్‌ కింద పారా మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
1. హెల్త్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌: 216 సీట్లు; శిక్షణ కాలం: ఏడాది.
2. ఫిజియోథెరపీ టెక్నీషియన్‌: 60 సీట్లు; శిక్షణ కాలం: ఏడాది.
3. డెంటల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌: 24 సీట్లు; శిక్షణ కాలం: రెండేళ్లు.
4. రేడియాలజీ టెక్నీషియన్‌: 20 సీట్లు; శిక్షణ కాలం: రెండేళ్లు.
అర్హత: కోర్సును అనుసరించి పదో తరగతి, పన్నెండో తరగతి.
వయసు: 01.08.2023 నాటికి కనీసం 14 సంవత్సరాలు నిండి ఉండాలి.
ఎంపిక: ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌ సర్వ్‌ ప్రాతిపదికన ప్రవేశాలు కల్పిస్తారు.
రిజిస్ట్రేషన్‌ ఫీజు: రూ.500.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 03-07-2023.
వెబ్‌సైట్‌: https://www.nitcindia.com/


సెస్‌, హైదరాబాద్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌

హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌ (సెస్‌) తెలంగాణ యూనివర్సిటీ (నిజామాబాద్‌) సహకారంతో రెగ్యులర్‌ పీహెచ్‌డీలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
మొత్తం సీట్ల సంఖ్య: 12
పీహెచ్‌డీ విభాగాలు: 1. ఎకనామిక్స్‌  2. సోషియాలజీ/ ఆంత్రోపాలజీ/ సోషల్‌ వర్క్‌ 3. డెవలప్‌మెంట్‌ స్టాటిస్టిక్స్‌ 4. పొలిటికల్‌ సైన్స్‌/ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ 5. కామర్స్‌/ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌
అర్హత: సంబంధిత సబ్జెక్టులో కనీసం 55 శాతం మార్కులతో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ లేదా ఎంఫిల్‌.
ఎంపిక: ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 09-07-2023.
ప్రవేశ పరీక్ష (ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌) తేదీ: 27-07-2023.
ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థులు జాబితా వెల్లడి: 17-08-2023.
కోర్సు ప్రారంభం: 2023, ఆగస్టు చివరి వారం.
వెబ్‌సైట్‌: https://cess.ac.in/


అప్రెంటిస్‌షిప్‌
సింగరేణి కాలరీస్‌లో అప్రెంటిస్‌షిప్‌ శిక్షణ  
కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌, హెచ్‌ఆర్‌డీ విభాగం 2023-24 సంవత్సరానికి వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌షిప్‌ శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ట్రేడ్‌లు: ఎలక్ట్రానిక్స్‌, ఫిట్టర్‌లు, టర్నర్‌, మెషినిస్ట్‌, మెకానిక్‌ మోటార్‌ వెహికల్‌, డ్రాఫ్ట్స్‌మ్యాన్‌ (సివిల్‌), మెకానిక్‌ డీజిల్‌, మౌల్డర్‌, వెల్డర్‌.
అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ.
వయసు: 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
స్టైపెండ్‌: ట్రేడును బట్టి నెలకు రూ.7,700 నుంచి రూ.8050 వరకు.
ఎంపిక: ఐటీఐ ఉత్తీర్ణుల సీనియారిటీ ఆధారంగా. సీనియారిటీ ప్రకారం అభ్యర్థులు ఎక్కువసంఖ్యలో ఉంటే ఐటీఐ మార్కులను పరిగణిస్తారు.
దరఖాస్తు: ఎస్‌సీసీఎల్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని హార్డ్‌ కాపీ, సంబంధిత ధ్రువపత్రాలను జతచేసి రిజిస్టర్డ్‌ పోస్టు/ కొరియర్‌/ వ్యక్తిగతంగా ఏదైనా ఎంవీటీసీ కేంద్రాల్లో అందజేయవచ్చు.
దరఖాస్తుకు చివరి తేదీ: 30-06-2023.
వెబ్‌సైట్‌: https://scclmines.com/scclnew/index.asp


ఉద్యోగాలు
రిజర్వ్‌ బ్యాంకులో జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టులు
ముంబయి ప్రధాన కేంద్రంగా గల రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కింది విభాగాల్లో జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
జూనియర్‌ ఇంజినీర్‌ (సివిల్‌/ ఎల‌్రక్టికల్‌): 35 పోస్టులు
అర్హతలు: కనీసం 65% మార్కులతో డిప్లొమా/ డిగ్రీ (సివిల్‌ ఇంజినీరింగ్‌/ ఎలక్ట్రికల్‌ లేదా ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01/06/2023 నాటికి 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: ఆన్‌లైన్‌ పరీక్ష, లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌, ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు రుసుము: జనరల్‌/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.450. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు రూ.50.
ఆన్‌లైన్‌ దరఖాస్తు, పరీక్ష ఫీజు చెల్లింపు చివరి తేదీ: 30-06-2023.
ఆన్‌లైన్‌ పరీక్ష తేదీ: 15-07-2023.

వెబ్‌సైట్‌: https://www.rbi.org.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని