నోటిఫికేషన్స్

కాకినాడలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన 97 స్టాఫ్‌ నర్స్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Published : 28 Jun 2023 00:50 IST
ఉద్యోగాలు

జీజీహెచ్‌, కాకినాడలో 97 స్టాఫ్‌ నర్స్‌లు
కాకినాడలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన 97 స్టాఫ్‌ నర్స్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
1. స్టాఫ్‌ నర్స్‌ (జీఎన్‌ఎం): 43  2. స్టాఫ్‌ నర్స్‌ (బీఎస్సీ నర్సింగ్‌): 28  
3. స్టాఫ్‌ నర్స్‌ (ఎమ్మెస్సీ నర్సింగ్‌): 26
అర్హత: జీఎన్‌ఎం/ బీఎస్సీ(నర్సింగ్‌)/ ఎమ్మెస్సీ (నర్సింగ్‌).
వయసు: 01-07-2023 నాటికి 42 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక: అకడమిక్‌ మెరిట్‌, పని అనుభవం ఆధారంగా.
దరఖాస్తు రుసుము: ఓసీ/ బీసీ అభ్యర్థులకు రూ.400. ఈడబ్ల్యూఎస్‌/ ఎస్టీ/ ఎస్సీ/ పీహెచ్‌ అభ్యర్థులకు రూ.200.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను కాకినాడ జీజీహెచ్‌ కార్యాలయంలోని నిర్దిష్ట కౌంటర్లలో సమర్పించాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 30-06-2023.
వెబ్‌సైట్‌: https://kakinada.ap.gov.in/


ప్రవేశాలు

సి-డాక్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమాలు
పుణెలోని సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సి-డాక్‌)- పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇవి 24 వారాల వ్యవధిగల ఫుల్‌ టైం కోర్సులు.
శిక్షణ కేంద్రాలు: బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌, కొచ్చి, కోల్‌కతా, ముంబయి, నవీముంబయి, తిరువనంతపురం, నోయిడా, న్యూదిల్లీ, గువాహటీ, పట్నా, సిల్చార్‌, భువనేశ్వర్‌, ఇందౌర్‌, జైపుర్‌, కరాద్‌, నాగ్‌పుర్‌, పుణె.
1. అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ 2. బిగ్‌ డేటా అనలిటిక్స్‌
3. ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌ డిజైన్‌
4. ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, సిస్టమ్స్‌ అండ్‌ సెక్యూరిటీ
5. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ 6. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌
7. వీఎల్‌ఎస్‌ఐ డిజైన్‌ 8. మొబైల్‌ కంప్యూటింగ్‌
9. అడ్వాన్స్‌డ్‌ సెక్యూర్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌
10.జియోఇన్ఫర్మేటిక్స్‌ 11. రోబోటిక్స్‌ అండ్‌ అలైడ్‌ టెక్నాలజీస్‌
12. హెచ్‌పీసీ సిస్టమ్‌ అడ్మినిస్ట్రేషన్‌
13. ఫిన్‌టెక్‌ అండ్‌ బ్లాక్‌చెయిన్‌ డెవలప్‌మెంట్‌
14. సైబర్‌ సెక్యూరిటీ అండ్‌ ఫోరెన్సిక్స్‌
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక: కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ ద్వారా.
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌, దరఖాస్తు గడువు: 05-07-2023.
కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌: 15-07-2023, 16-07-2023.
పరీక్ష ఫలితాల వెల్లడి: 28-07-2023.
వెబ్‌సైట్‌: https://www.cdac.in/


నిమ్‌హాన్స్‌, బెంగళూరులో యూజీ కోర్సులు

బెంగళూరులోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ న్యూరోసైన్సెస్‌ (నిమ్‌హాన్స్‌) అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కోర్సు- సీట్ల వివరాలు...
1. బీఎస్సీ అనస్తీషియా టెక్నాలజీ: 11  
2. బీఎస్సీ నర్సింగ్‌: 85  3. బీఎస్సీ రేడియోగ్రఫీ: 11
4. బీఎస్సీ క్లినికల్‌ న్యూరోఫిజియాలజీ టెక్నాలజీ: 07
5. సర్టిఫికెట్ల కోర్సు న్యూరోపాథాలజీ టెక్నాలజీ: 02
6. పోస్ట్‌ బేసిక్‌ డిప్లొమా ఇన్‌ సైకియాట్రిక్‌/ మెంటల్‌ హెల్త్‌ నర్సింగ్‌: 45
7. పోస్ట్‌ బేసిక్‌ డిప్లొమా ఇన్‌ న్యూరోసైన్స్‌ నర్సింగ్‌: 09 సీట్లు
అర్హత: కోర్సును అనుసరించి 12వ తరగతి (ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్‌), డిప్లొమా, డిగ్రీ, రిజిస్టర్డ్‌ నర్స్‌, బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక: ప్రవేశ పరీక్ష, ఒరిజినల్‌ సర్టిఫికెట్ల తనిఖీ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: జనరల్‌/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలకు రూ.1000; ఎస్సీ/ ఎస్టీ కేటగిరీలకు రూ.750; దివ్యాంగులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 07.07.2023.
వెబ్‌సైట్‌: https://nimhans.ac.in/


ఆర్మీ నర్సింగ్‌ కళాశాలల్లో బీఎస్సీ నర్సింగ్‌

భారతీయ సైన్యం...దేశవ్యాప్తంగా ఉన్న అయిదు కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌ ఆఫ్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ మెడికల్‌ సర్వీసెస్‌ (ఏఎఫ్‌ఎంఎస్‌)లో ప్రారంభమయ్యే నాలుగేళ్ల బీఎస్సీ (నర్సింగ్‌)లో ప్రవేశానికి మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
మొత్తం సీట్లు: 220
ఏఎఫ్‌ఎంఎస్‌, సీట్లు: కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌, పుణె- 40, కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌, కోల్‌కతా- 30, కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌, ముంబయి- 40, కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌, లఖ్‌నవూ- 40, కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌, బెంగళూరు- 40.
అర్హత: అవివాహిత/ విడాకులు తీసుకున్న/ చట్టబద్ధంగా విడిపోయిన/ వితంతువులైన మహిళా అభ్యర్థులు అర్హులు. కనీసం 50% మార్కులు సీనియర్‌ సెకండరీ పరీక్ష 10+2 (ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్‌). నీట్‌ (యూజీ) 2023లో అర్హత, కనిష్ఠ ఎత్తు 152 సెం.మీ. ఉండాలి.
వయసు: 01-10-1998- 30-09-2006 మధ్య జన్మించినవారై ఉండాలి.
సీటుకు ఎంపిక: నీట్‌ 2023 స్కోరు, జనరల్‌ ఇంటెలిజెన్స్‌/ జనరల్‌ ఇంగ్లిష్‌ టెస్ట్‌, సైకలాజికల్‌ అసెస్‌మెంట్‌, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 04-07-2023.
వెబ్‌సైట్‌: https://joinindianarmy.nic.in/


వాక్‌ ఇన్స్‌

కేంద్రీయ విద్యాలయలో టీచింగ్‌ పోస్టులు
హకీంపేటలోని కేంద్రీయ విద్యాలయం కాంట్రాక్టు ప్రాతిపదికన పార్ట్‌ టైమ్‌ టీచర్ల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
1. పీజీటీ (ఇంగ్లిష్‌)    2. టీజీటీ (హిందీ)
3. స్పెషల్‌ ఎడ్యుకేటర్‌  4. స్టూడెంట్స్‌ కౌన్సెలర్‌
అర్హత: పోస్టుననుసరించి డిప్లొమా, డిగ్రీ, పీజీ, బీఈడీ, టెట్‌/ సీటీఈటీ. ఇంటర్వ్యూ తేదీ: 30/06/2023.
వేదిక: కేంద్రీయ విద్యాలయం, ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌, హకీంపేట్‌.
వెబ్‌సైట్‌: https://hakimpet.kvs.ac.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు