మెడికల్‌లో షార్ట్‌టర్మ్‌ కోర్సులు..

డిగ్రీ ఫస్టియర్‌ పరీక్షలు 2015లో రాస్తే రెండు సబ్జెక్టులు మిగిలాయి. తర్వాత ఆర్థిక సమస్యలతో మెడికల్‌ షాప్‌లో చేరాను. ఇప్పుడు డిగ్రీ కొనసాగించవచ్చా? మెడికల్‌కు సంబంధించిన షార్ట్‌టర్మ్‌ కోర్సులుంటే చెప్పండి.

Published : 29 Jun 2023 00:12 IST

డిగ్రీ ఫస్టియర్‌ పరీక్షలు 2015లో రాస్తే రెండు సబ్జెక్టులు మిగిలాయి. తర్వాత ఆర్థిక సమస్యలతో మెడికల్‌ షాప్‌లో చేరాను. ఇప్పుడు డిగ్రీ కొనసాగించవచ్చా? మెడికల్‌కు సంబంధించిన షార్ట్‌టర్మ్‌ కోర్సులుంటే చెప్పండి.

ఎ.సతీష్

* యూజీసీ నిబంధనల ప్రకారం మూడు సంవత్సరాల డిగ్రీ కోర్సును గరిష్ఠంగా ఐదు సంవత్సరాల్లో మాత్రమే పూర్తి చేయాలి. ఈ ఐదేళ్లలో మీరు మూడు సంవత్సరాలు కళాశాలకు వెళ్లి, కనీస హాజరు శాతాన్ని పొందివుంటే, ఐదు సంవత్సరాల తరువాత కూడా మిగిలిన సబ్జెక్టులను మీరు డిగ్రీ చదివిన యూనివర్సిటీ నిబంధనలకు లోబడి, సప్లిమెంటరీ పరీక్షలు రాయొచ్చు. డిగ్రీ పూర్తి చేయవచ్చు. కానీ మొదటి ఐదేళ్లలో మీరు ఒక సంవత్సరమే చదివారు కాబట్టి, ఇప్పుడు డిగ్రీని కొనసాగించే అవకాశం లేదు. మీకు ఒక విద్యాసంవత్సరమే వృథా అయింది కాబట్టి, రెగ్యులర్‌/ డిస్టెన్స్‌/ ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరి డిగ్రీ పూర్తి చేయండి. ఏదైనా కారణం వల్ల భవిష్యత్తులో ఒకటి/ రెండు సంవత్సరాల తరువాత డిగ్రీని ఆపివేయాల్సి వస్తే, జాతీయ నూతన విద్యావిధానం నిబంధనల ప్రకారం మీరు సర్టిఫికెట్‌/ డిప్లొమా పొందే అవకాశం కూడా ఉంది. మెడికల్‌కు సంబంధించిన షార్ట్‌ టర్మ్‌ కోర్సుల విషయానికొస్తే- చాలా కోర్సులకు ఇంటర్‌లో బైపీసీ చదివి ఉండాలి. మీరు ఇంటర్‌లో ఏయే సబ్జెక్టులు చదివారో చెప్పలేదు. సరైన విద్యార్హత ఉంటే.. మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఈసీజీ అసిస్టెంట్‌, నర్సింగ్‌ అసిస్టెంట్‌, ఆపరేషన్‌ థియేటర్‌ అసిస్టెంట్‌, రేడియాలజీ టెక్నీషియన్‌, ఫిజియెథెరపీ, డీ ఫార్మసీ వీటిలో ఏదైనా కోర్సు రెగ్యులర్‌గా చేయవచ్చు.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు