సైకాలజీ పీజీలో ఏది మేలు?

బి.ఎ. (సైకాలజీ) చివరి సంవత్సరం చదువుతున్నాను. పీజీలో ఏ     స్పెషలైజేషన్‌ తీసుకుంటే బాగుంటుంది? ఈ కోర్సుతో ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి?

Updated : 20 Jul 2023 02:28 IST

బి.ఎ. (సైకాలజీ) చివరి సంవత్సరం చదువుతున్నాను. పీజీలో ఏ స్పెషలైజేషన్‌ తీసుకుంటే బాగుంటుంది? ఈ కోర్సుతో ఉద్యోగ         అవకాశాలు ఎలా ఉంటాయి?

బి సుజిత్‌కుమార్‌

* మీరు బి.ఎ. చివరి సంవత్సరంలో ఉన్నారు కాబట్టి, ఇప్పటికే కొన్ని స్పెషలైజేషన్‌ కోర్సులు చదువుతూ ఉండుంటారు. వాటిలో మీకు ఇష్టమైన కోర్సును పీజీలో స్పెషలైజేషన్‌గా తీసుకోవచ్చు. పీజీ సైకాలజీలో ఎడ్యుకేషన్‌, ఇండస్ట్రియల్‌ అండ్‌ ఆర్గనైజేషనల్‌, సోషల్‌, కౌన్సెలింగ్‌, హెల్త్‌, కాగ్నిటివ్‌, క్లినికల్‌, స్పోర్ట్స్‌.. లాంటి స్పెషలైజేషన్‌లు ఉన్నాయి. ఇవే కాకుండా కొన్ని విదేశీ/ ప్రైవేటు యూనివర్సిటీల్లో అడిక్షన్‌ సైకాలజీ, బయో సైకాలజీ, డెవలప్‌మెంటల్‌ సైకాలజీ, ఎన్విరాన్మెంటల్‌ సైకాలజీ, ఫోరెన్సిక్‌ సైకాలజీ, న్యూరో సైకాలజీ, ఫిజియాలజికల్‌ సైకాలజీ లాంటివీ లభిస్తున్నాయి. మీరు పీజీ తరువాత ఏం చదవాలనుకుంటున్నారో, ఎలాంటి సంస్థల్లో ఉద్యోగం చేయాలనుకుంటున్నారో అనే అంశాలను బట్టి సరైన స్పెషలైజేషన్‌ని ఎంచుకోండి. మీరు ఎంచుకొన్న స్పెషలైజేషన్‌ని బట్టి మీ ఉద్యోగావకాశాలుంటాయి. సైకాలజీ చదివినవారికి అతి తక్కువ సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేటు రంగంలో ఎక్కువ ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఈ కోర్సు చదివినవారు సైకాలజిస్ట్‌, కౌన్సెలర్‌, మెంటల్‌ హెల్త్‌ కౌన్సెలర్‌, సైకో థెరపిస్ట్‌, క్లినికల్‌ సైకాలజిస్ట్‌, ఆక్యుపేషనల్‌ సైకాలజిస్ట్‌, లైఫ్‌ కోచ్‌, మీడియేటర్‌, కన్సల్టెంట్‌, మెంటర్‌, మార్కెటింగ్‌ రిసెర్చర్‌, స్పోర్ట్స్‌ సైకాలజిస్ట్‌, మెంటల్‌ హెల్త్‌ ప్రాక్టీషనర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌, ఆర్గనైజేషనల్‌ ట్రైనర్‌, సోషల్‌ వర్కర్‌, బిహేవియర్‌ అనలిస్ట్‌ ఇలాంటి విభిన్న హోదాల్లో ఉద్యోగాలు చేయవచ్చు. సైకాలజీ అధ్యాపకులుగానూ స్థిరపడే అవకాశాలున్నాయి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు