మెరుగైన మార్కులు రావాలంటే?

రైల్వే కానిస్టేబుల్‌ పరీక్షకు హాజరవుతున్నాను. దీనిలో మెరుగైన మార్కులు రావాలంటే ఏం చేయాలి?

Published : 26 Jul 2023 00:47 IST

రైల్వే కానిస్టేబుల్‌ పరీక్షకు హాజరవుతున్నాను. దీనిలో మెరుగైన మార్కులు రావాలంటే ఏం చేయాలి?

టి.వంశీ

* రైల్వే కానిస్టేబుల్‌ నియామక పరీక్ష 120  మార్కులకు, 120 ప్రశ్నలతో, 90 నిమిషాల వ్యవధి గల కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష. ప్రతి సరైన సమాధానానికీ ఒక మార్కు, ప్రతి తప్పు సమాధానానికీ 0.33 నెగటివ్‌ మార్కులుంటాయి. రాత పరీక్ష, శారీరక దార్ఢ్య పరీక్ష, మెడికల్‌ టెస్ట్‌...ఈ మూడు దశలనూ విజయవంతంగా పూర్తి చేసినవారికి కానిస్టేబుల్‌ ఉద్యోగం లభిస్తుంది. రాత పరీక్షలో అరిథ్‌మెటిక్‌, జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌ ఉంటాయి. ఆర్‌.ఎస్‌. అగర్వాల్‌ పుస్తకాలు చాలా ఉపయోగపడతాయి. మాక్‌ టెస్ట్‌ల విషయానికొస్తే ఆన్‌లైన్‌లో చాలా వెబ్‌సైట్‌లు అందుబాటులో ఉన్నాయి. విశ్వసనీయతను బట్టి సరైనవాటిని ఎంచుకోండి. వాటితో పాటు రైల్వే రిక్రూట్‌మెంట్‌ పరీక్షల పాత ప్రశ్నపత్రాలను, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌, బ్యాంకింగ్‌కి సంబంధించిన నమూనా ప్రశ్నపత్రాలను సాధన చేయండి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు