సరైనదేనా?

బీకాం బిజినెస్‌ అనలిటిక్స్‌ రెండో సంవత్సరం చదువుతున్నాను. ఇంటర్‌ ఒకేషనల్‌ కోర్సు చేశాను. భవిష్యత్తులో డేటా ఎనలిస్ట్‌ కావాలనే నా నిర్ణయం సరైనదేనా?

Published : 01 Aug 2023 00:01 IST

బీకాం బిజినెస్‌ అనలిటిక్స్‌ రెండో సంవత్సరం చదువుతున్నాను. ఇంటర్‌ ఒకేషనల్‌ కోర్సు చేశాను. భవిష్యత్తులో డేటా ఎనలిస్ట్‌ కావాలనే నా నిర్ణయం సరైనదేనా?

ఎన్‌ అభిషేక్‌

  • బీకాం బిజినెస్‌ అనలిటిక్స్‌ కోర్సు తరువాత డేటా అనలిస్ట్‌ అవ్వాలన్న మీ నిర్ణయం సరైందే. బీకాం తరువాత, అవకాశం ఉంటే ఎంబీఏ బిజినెస్‌ అనలిటిక్స్‌ కోర్సు కూడా చదవండి. డేటా అనలిస్ట్‌ అవ్వడానికి సంబంధించిన ప్రాథమిక మెలకువలను మీరు బిజినెస్‌ అనలిటిక్స్‌ డిగ్రీలో చదువుతారు. అవకాశం ఉంటే ఐఐటీ మద్రాస్‌ అందిస్తున్న ఆన్‌లైన్‌ బీఎస్‌సీ డేటా సైన్స్‌ డిగ్రీని కూడా పూర్తి చేయండి. అలా కాకపోతే డిగ్రీ చేస్తూనే, డేటా సైన్స్‌ కోర్సులను ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ ద్వారా చేయండి. డేటా అనలిస్ట్‌ అవ్వాలంటే మేథమెటిక్స్‌, స్టాటిస్టిక్స్‌, ప్రోగ్రామింగ్‌, కోడింగ్‌లపై మంచి పట్టుండాలి. మీరు ఇంటర్‌ ఒకేషనల్‌ కోర్సు చదివారు కాబట్టి, ఇంటర్‌ మ్యాథ్స్‌పై పట్టు సాధించండి. బీకాం డిగ్రీతో పాటు డేటా సైన్స్‌లో సర్టిఫికెట్‌/ డిప్లొమా కోర్సులు చేస్తూ, లైవ్‌ ప్రాజెక్టులు కూడా చేస్తే మీ ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని