దూరవిద్యలో ఎంబీఏ ఎక్కడ?

బీటెక్‌ (కెమికల్‌ ఇంజినీరింగ్‌) చేసి కెమికల్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా. కెరియర్‌ మారాలనుకుంటున్నాను. పనిచేస్తూనే ఏపీ నుంచి దూరవిద్యలో ఎంబీఏ (హెచ్‌ఆర్‌) చేయాలంటే ఎక్కడ మేలు?

Published : 08 Aug 2023 00:53 IST

బీటెక్‌ (కెమికల్‌ ఇంజినీరింగ్‌) చేసి కెమికల్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా. కెరియర్‌ మారాలనుకుంటున్నాను. పనిచేస్తూనే ఏపీ నుంచి దూరవిద్యలో ఎంబీఏ (హెచ్‌ఆర్‌) చేయాలంటే ఎక్కడ మేలు?

ఎ.శ్రీహరి

మీరు దూరవిద్యలో ఎంబీఏ చేయాలనుకొంటే ఆంధ్రప్రదేశ్‌ నుంచే చేయాల్సిన అవసరం లేదు. ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్శిటీ ద్వారా చేస్తే మీ డిగ్రీకి ఎక్కువ గుర్తింపు ఉండే అవకాశం ఉంది. పాండిచ్చేరి యూనివర్సిటీ దూరవిద్య ద్వారా కూడా ఎంబీఏ చదవొచ్చు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ, హైదరాబాద్‌ నుంచీ చదివే అవకాశం ఉంది. ఇవే కాకుండా సాంప్రదాయిక విశ్వవిద్యాలయాలైన ఆంధ్రా యూనివర్సిటీ, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీల్లో కూడా దూరవిద్య ద్వారా ఎంబీఏ చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రైవేటు డీమ్డ్‌ టు బీ వర్సిటీల్లో ఆన్‌లైన్‌ విధానంలో ఎంబీఏ చేయొచ్చు. వీటితో పాటు ఇతర రాష్ట్రాల ప్రముఖ ప్రైవేటు/డీమ్డ్‌ టు బీ వర్సిటీలు ఎంబీఏని ఆన్‌లైన్‌ విధానంలో అందిస్తున్నాయి. కోర్సును, యూనివర్సిటీని ఎంచుకొనేముందు ఆ కోర్సుకు యూజీసీ, డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ బ్యూరో అనుమతులు, ఏఐసీటీఈ గుర్తింపు, ఆ వర్సిటీకి న్యాక్‌ గ్రేడింగ్‌ ఏ/ఏ ప్లస్‌/ఏ ప్లస్‌ ప్లస్‌ ఉన్నాయో, లేదో తెలుసుకోండి. సాధారణంగా ఎంబీఏలో ప్రవేశం పొందాలంటే ఆ యూనివర్సిటీ నిర్వహించే ప్రవేశపరీక్ష కానీ, రాష్ట్రస్థాయి ఐసెట్‌ కానీ రాయవలసి ఉంటుంది.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు