సరైన నిర్ణయమేనా?

హిస్టరీ అండ్‌ టూరిజంలో పీజీ చేశాను. డిగ్రీలో హిస్టరీ, ఎకనామిక్స్‌, పొలిటికల్‌ సైన్స్‌ చదివాను. టూరిజం ఉద్యోగం చేయాలనుకుంటున్నా. నా నిర్ణయం సరైనదేనా?

Published : 14 Aug 2023 00:46 IST

హిస్టరీ అండ్‌ టూరిజంలో పీజీ చేశాను. డిగ్రీలో హిస్టరీ, ఎకనామిక్స్‌, పొలిటికల్‌ సైన్స్‌ చదివాను. టూరిజం ఉద్యోగం చేయాలనుకుంటున్నా. నా నిర్ణయం సరైనదేనా?

పి.బాలకృష్ణ

మీకు నచ్చిన ఉద్యోగం చేయడం ఎప్పుడూ శ్రేయస్కరం. చదివిన చదువుకు సంబంధించిన ఉద్యోగం చేయడం అదృష్టం కూడా! ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది చదివిన కోర్సుకూ, చేయాలనుకొన్న - చేస్తున్న కొలువుకూ ఎలాంటి సంబంధం ఉండట్లేదు. దీంతో కొందరు ఉద్యోగాలు మారే ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. టూరిజం రంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు హిస్టరీ అండ్‌ టూరిజంలో పీజీ చేశారు కాబట్టి ఎంబీఏ ట్రావెల్‌ అండ్‌ టూరిజం, బీబీఏ టూరిజం చదివినవారితో పోటీ పడాల్సి ఉంటుంది. మీరు ఈ రంగంలో రాణించాలంటే- కంప్యూటర్‌, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలను పెంపొందించుకోండి. అవకాశం ఉంటే తెలుగు, ఇంగ్లిష్‌లతో పాటు హిందీ, మరో విదేశీ భాషను నేర్చుకొనే ప్రయత్నం చేయండి. టూరిజం రంగంలోనే స్థిరపడాలనుకొంటే ఎంబీఏ ట్రావెల్‌ అండ్‌ టూరిజం మేనేజ్‌మెంట్‌ చదివే ప్రయత్నం కూడా చేయండి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు