ఈసీఈ చదువుతూనే కోడింగ్‌

ఎన్‌ఐటీ నాగ్‌పుర్‌లో ఈసీఈ కోర్సులో చేరబోతున్నాను. చదువుకుంటూనే కోడింగ్‌ నేర్చుకోవాలనుకుంటున్నాను. సీఎస్‌ఈ విద్యార్థిలాగే కోడింగ్‌ బాగా నేర్చుకుని ఉద్యోగం పొందాలంటే?

Published : 15 Aug 2023 00:07 IST

ఎన్‌ఐటీ నాగ్‌పుర్‌లో ఈసీఈ కోర్సులో చేరబోతున్నాను. చదువుకుంటూనే కోడింగ్‌ నేర్చుకోవాలనుకుంటున్నాను. సీఎస్‌ఈ విద్యార్థిలాగే కోడింగ్‌ బాగా నేర్చుకుని ఉద్యోగం పొందాలంటే?

పి.హరితేజ

ఇంజినీరింగ్‌లో ఈసీఈ చదువుతూ సీఎస్‌ఈ విద్యార్థిలా కోడింగ్‌ చేయగలగడం పెద్ద కష్టమేమీ కాదు. ముందుగా ఈ రెండు బ్రాంచ్‌ల సిలబస్‌ పరిశీలించండి. రెండిటిలో కామన్‌గా ఉన్న సబ్జెక్టులను ఎలాగూ మీరు చదువుతారు. సీఎస్‌ఈలో కోడింగ్‌కి సంబంధించిన సబ్జెక్టులు ఏమున్నాయో తెలుసుకొని వాటిని నేర్చుకొనే ప్రయత్నం చేయండి. ముందుగా ఎంఎస్‌ ఎక్సెల్‌, సీ, సీ ప్లస్‌ ప్లస్‌, ఆర్‌, జావా, పైతాన్‌ ప్రోగ్రామింగ్‌లను నేర్చుకోవడం మొదలుపెట్టండి. తరువాత వెబ్‌ డెవలప్‌మెంట్‌ లాంటి కోర్సులను కూడా చేయండి. వీటితో పాటు కోర్స్‌ఎరా, యుడెమి, ఎడెక్స్‌, ఉడాసిటీ, ఖాన్‌ అకాడెమీ, స్వయం,    ఎన్‌పీటెల్‌తో పాటు కోడింగ్‌కి సంబంధించిన  ప్రత్యేక ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ల నుంచి సరైన కోర్సులు చేయండి. కోడింగ్‌ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి ఈసీఈ కోర్సును నిర్లక్ష్యం చేయకండి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని