డేటా సైన్స్‌ చదివాక...

బీఎస్సీ డేటాసైన్స్‌తో ఉన్నతవిద్య, ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి? ఎన్‌ఐటీలు, ఐఐటీలు ప్రవేశపెడుతున్న ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్సీ చదవాలంటే ఏ విద్యార్హతలుండాలి? 

Published : 17 Aug 2023 00:17 IST

  • బీఎస్సీ డేటాసైన్స్‌తో ఉన్నతవిద్య, ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి? ఎన్‌ఐటీలు, ఐఐటీలు ప్రవేశపెడుతున్న ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్సీ చదవాలంటే ఏ విద్యార్హతలుండాలి? 

కార్తీక్‌

  • బీఎస్సీ డేటా సైన్స్‌ చదివినవారు ఎమ్మెస్సీ డేటా సైన్స్‌ కానీ, ఎమ్మెస్సీ డేటా అనలిటిక్స్‌ కానీ, ఎంబీఏ బిజినెస్‌ అనలిటిక్స్‌ కానీ చదివే అవకాశం ఉంది. మీరు బీఎస్సీలో డేటా సైన్స్‌తో పాటు స్టాటిస్టిక్స్‌ సబ్జెక్టును మూడు సంవత్సరాల పాటు చదివి ఉంటే, ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్‌ చదవొచ్చు. డిగ్రీలో కంప్యూటర్‌ సైన్స్‌ ఒక సబ్జెక్ట్‌గా మూడు సంవత్సరాలు చదివుంటే, ఎమ్మెస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ చదివే అవకాశం ఉంది. వీటితోపాటు, ఏదైనా డిగ్రీ విద్యార్హతతో చదివే ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లోనూ చేరొచ్చు. ఇక ఉద్యోగావకాశాల విషయానికొస్తే- బీఎస్సీ డేటా సైన్స్‌ చదివినవారు డేటా అనలిస్ట్‌, డేటా సైంటిస్ట్‌, డేటా ఆర్కిటెక్ట్‌, డేటా అడ్మినిస్ట్రేటర్‌, డేటా మైనింగ్‌ ఇంజనీర్‌ హోదాలతో ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. ఎన్‌ఐటీ, ఐఐటీల్లో ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ చదవాలంటే ఇంటర్‌లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ చదివి ఉండాలి. పదో తరగతిలో, ఇంటర్‌లో కనీసం 60 శాతం మార్కులు పొంది ఉండాలి. వీటితో పాటు ఒక్కో విద్యాసంస్థ నిర్దేశించే అదనపు అర్హతలను కూడా గమనించండి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు