ఇంజినీరింగ్‌ కాకుండా...

ఇంటర్‌ (ఎంపీసీ) చదువుతున్నాను. ఇంజినీరింగ్‌ కాకుండా ఇంకా ఏ కోర్సులు చదవొచ్చు? ఆర్థిక సమస్యల కారణంగా త్వరగా ఉద్యోగం సాధించాల్సిన అవసరముంది

Published : 23 Aug 2023 00:56 IST


ఇంటర్‌ (ఎంపీసీ) చదువుతున్నాను. ఇంజినీరింగ్‌ కాకుండా ఇంకా ఏ కోర్సులు చదవొచ్చు? ఆర్థిక సమస్యల కారణంగా త్వరగా ఉద్యోగం సాధించాల్సిన అవసరముంది. ఏ సబ్జెక్టులతో డిగ్రీ చేస్తే మంచిది?  

రూప

ఇంటర్‌ ఎంపీసీ చదివిన తరువాత ఇంజినీరింగ్‌ కాకుండా చాలా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మీరు త్వరగా ఉద్యోగంలో స్థిరపడాలని అనుకొంటున్నారు కాబట్టి, ఏదైనా ప్రొఫెషనల్‌ కోర్సు చేయండి. బీబీఏ (జనరల్‌), బీకాం(కంప్యూటర్స్‌), బీకాం (ప్రొఫెషనల్‌), బీఎస్సీ (డేటా సైన్స్‌), బీబీఏ (బిజినెస్‌ అనలిటిక్స్‌), బీబీఏ (టూరిజం), బీసీఏ లాంటి కోర్సులతో త్వరగా ఉపాధికి వీలుంటుంది. మీకు బోధన రంగంపై ఆసక్తి ఉంటే రెండు సంవత్సరాల వ్యవధి ఉన్న డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ కూడా చేయొచ్చు. డిగ్రీతో పాటు బీఈడీ కలిపి చేయాలనుకుంటే, నాలుగు సంవత్సరాల వ్యవధి కల ఇంటిగ్రేటెడ్‌ టీచర్‌ ప్రోగ్రాం (బీఎస్సీ ఎడ్‌) చేయొచ్చు. ఆసక్తి ఉంటే హోటల్‌ మేనేజ్‌మెంట్‌, ఫ్యాషన్‌ టెక్నాలజీ లాంటి కోర్సుల గురించీ ఆలోచించండి.
ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని