ఫ్రీలాన్సింగ్‌ చేయాలంటే?

ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌ చేశాను. సాహిత్యాభిలాషిని కూడా. ఫ్రీలాన్సర్‌గా పనిచేయాలంటే ఎలాంటి నైపుణ్యాలు కావాలి?

Published : 28 Aug 2023 00:08 IST

ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌ చేశాను. సాహిత్యాభిలాషిని కూడా. ఫ్రీలాన్సర్‌గా పనిచేయాలంటే ఎలాంటి నైపుణ్యాలు కావాలి? సాంకేతిక నైపుణ్యం ఎలా పెంచుకోవాలి? 

అపురూప

  • మీరు ఫ్రీలాన్సర్‌గా ఏ రంగంలో ఉండాలనుకొంటున్నారు? అందుకు సాంకేతిక నైపుణ్యం ఎందుకు అవసరం? ఈ విషయాలపై స్పష్టత లేదు. ఫ్రీలాన్సర్‌గా పనిచేయాలంటే సమకాలీన సమాజ పరిస్థితులపై స్పష్టత, నిశిత పరిశీలన, సంబంధిత పుస్తకాలను విమర్శనాత్మకంగా చదవడం, పరిశోధనలో ప్రాథ]మిక పద్దతులపై అవగాహన, సృజనాత్మకత, భాషపై మంచి పట్టు, అనువాద నైపుణ్యాలు చాలా అవసరం. ఇక సాంకేతిక నైపుణ్యాల విషయానికొస్తే- కంప్యూటర్‌ పరిజ్ఞానం, ఇంటర్నెట్‌ వాడటంలో మెలకువలు పెంపొందించుకోండి. ఎంఎస్‌ ఆఫీస్‌లో శిక్షణ పొందండి. తెలుగు, ఇంగ్లిష్‌ల్లో వేగంగా టైప్‌ చేయడం నేర్చుకోండి. చివరిగా.. ప్రాంతీయ భాషల్లో ఫ్రీలాన్సర్‌గా ఉంటే ఆకర్షణీయ వేతనాలు అంతగా ఉండవు. మీరు ఏదైనా వృత్తితో పాటు ఫ్రీలాన్సింగ్‌ని ఒక ప్రవృత్తిగా మాత్రమే పెట్టుకోండి.

 ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు