పీజీ తప్పనిసరా?

మా అమ్మాయి ఎంబీబీఎస్‌ చివరి ఏడాది చదువుతోంది. తర్వాత తనతో మా గ్రామంలో ప్రాక్టీస్‌ పెట్టించాలని ఉద్దేశం.

Published : 11 Sep 2023 00:08 IST

మా అమ్మాయి ఎంబీబీఎస్‌ చివరి ఏడాది చదువుతోంది. తర్వాత తనతో మా గ్రామంలో ప్రాక్టీస్‌ పెట్టించాలని ఉద్దేశం. కానీ పీజీ లేకపోతే ఎంబీబీఎస్‌కు విలువే లేదంటున్నారు. తప్పకుండా పీజీ చేయాల్సిందేనా?

మాలతి

మీ అమ్మాయి ఈ పాటికే తన భవిష్యత్తు గురించి ఓ నిర్ణయానికి వచ్చి ఉండొచ్చు. మీ గ్రామంలో ప్రాక్టీస్‌ పెట్టించాలనేది మీ నిర్ణయమా? తనదా? నిర్ణయం ఎవరిదయినా, అందులో ఉండే లాభనష్టాలను చర్చించండి. మీ గ్రామంలో ప్రాక్టీస్‌ చేయడం వల్ల  మీ గ్రామస్థులకు మెరుగైన వైద్యం అందించే అవకాశం ఉంటుంది. కానీ, మీరు హాస్పిటల్‌పై పెట్టిన పెట్టుబడి వెనక్కు రావడానికి చాలా సమయం పట్టవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు కూడా శస్త్రచికిత్సలకోసం దగ్గరలో ఉన్న పట్టణాలకు వెళ్తున్నారు. ఎంబీబీఎస్‌ చదివిన చాలామంది సాధారణ జబ్బులు, ప్రాథÅమిక చికిత్సలకే పరిమితమవుతున్నారు. మరికొన్ని సందర్భాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వైద్యశాలలకు పట్టణాలనుంచి స్పెషలిస్ట్‌ సర్జన్లు వచ్చి శస్త్రచికిత్సలు చేస్తున్నారు. గ్రామీణ సమాజంలో కూడా ఆరోగ్యం, వైద్యంపై అవగాహన పెరగడం వల్ల రోగులు/బంధువులు చికిత్సకు వెళ్లేముందు డాక్టర్ల విద్యార్హతల గురించి కూడా వాకబు చేస్తున్నారు. ఒకవేళ మీ అమ్మాయి ఎంబీబీఎస్‌తోనే ప్రాక్టీస్‌ మొదలుపెడితే పని ఒత్తిడితో ఎప్పటికీ పీజీ చేయలేకపోవచ్చు. ప్రాక్టీస్‌తో నిమిత్తం లేకుండా, ఉన్నత విద్యార్హతలుండటం ఎప్పుడూ శ్రేయస్కరమే! పీజీతోనే ఉపాధి అవకాశాలు పెరుగుతాయనే గ్యారంటీ కూడా లేదు. మెడిసిన్‌ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సుల్లో సర్టిఫికెట్‌లతో పాటు నైపుణ్యాలు కూడా చాలా అవసరం. మీ అమ్మాయి దీర్ఘకాలిక, స్వల్ప కాలిక ఆశయాలను దృష్టిలోపెట్టుకొని సరైన నిర్ణయం తీసుకోండి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని