బీఎల్‌తో పాటు సివిల్స్‌?

డిగ్రీ చదివి సివిల్స్‌కు ప్రిపేరవుతున్నాను. బీఎల్‌ రెగ్యులర్‌గా చదువుతూ సన్నద్ధమైతే.. సివిల్స్‌లో విఫలమైనా బీఎల్‌ డిగ్రీ చేతికి వస్తుందంటున్నారు నాన్న.

Updated : 12 Sep 2023 01:38 IST

డిగ్రీ చదివి సివిల్స్‌కు ప్రిపేరవుతున్నాను. బీఎల్‌ రెగ్యులర్‌గా చదువుతూ సన్నద్ధమైతే.. సివిల్స్‌లో విఫలమైనా బీఎల్‌ డిగ్రీ చేతికి వస్తుందంటున్నారు నాన్న. ఈ ఆలోచన సరైనదేనా?

ఎం.రత్నకిశోర్‌

సివిల్స్‌ లాంటి పరీక్షల్లో పోటీ ఎక్కువ ఉంటుంది. అందుకే చాలామంది తల్లిదండ్రులు మీ నాన్నగారిలాగే ఆలోచిస్తూ సివిల్స్‌ సన్నద్ధతతో పాటు, మరేదైనా ప్రొఫెషనల్‌ కోర్సు చదివితే, భవిష్యత్తులో ఇబ్బంది ఉండదని ఆలోచిస్తున్నారు. ఒకవేళ మీరు భవిష్యత్తులో మంచి న్యాయవాదిగా స్థిరపడాలంటే బీఎల్‌ కోర్సు కూడా బాగా చదవాలి. ప్రస్తుతం మీముందు మూడు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. 1) సివిల్స్‌కి మాత్రమే సన్నద్ధం అవ్వడం. ఒకవేళ దీనిలో నెగ్గకపోతే డిగ్రీ విద్యార్హతతో పోటీ పరీక్షలు రాసి మరేదైనా ప్రభుత్వ ఉద్యోగం పొందడం. మీకు ఆసక్తి ఉంటే అప్పుడు కూడా బీఎల్‌ చదవొచ్చు. 2) బీఎల్‌ పూర్తిచేసి సివిల్స్‌కు ప్రిపేర్‌ అవ్వడం. ఒకవేళ సివిల్స్‌లో విజయం సాధించలేకపోతే న్యాయవాదిగా స్థిరపడవచ్చు. 3) సివిల్స్‌ సన్నద్ధత + బీఎల్‌ చదవడం. అయితే రెండింటినీ సమన్వయం చేస్తూ ఒత్తిడికి గురవ్వకుండా, ప్రణాళికాబద్ధంగా చదవకపోతే ఈ రెండింటిలో మీరు దేనికీ న్యాయం చేయలేకపోవచ్చు.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని