హెల్త్‌వర్కర్‌ శిక్షణ తర్వాత...

మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్‌ (ఎంపీహెచ్‌డబ్ల్యూ)  శిక్షణ పూర్తిచేసి ప్రైవేట్‌ హాస్పిటల్‌లో పనిచేస్తున్నా. ఈ కోర్సుతో ఏ ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలు ఉంటాయి?

Published : 14 Sep 2023 00:55 IST

మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్‌ (ఎంపీహెచ్‌డబ్ల్యూ)  శిక్షణ పూర్తిచేసి ప్రైవేట్‌ హాస్పిటల్‌లో పనిచేస్తున్నా. ఈ కోర్సుతో ఏ ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలు ఉంటాయి?

కరుణ

ల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్‌ శిక్షణ పూర్తిచేసినవారికి ప్రభుత్వ వైద్య, ఆరోగ్యశాఖలో మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్‌గా ఉద్యోగావకాశాలుంటాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో, వైద్య, ఆరోగ్యరంగాల్లో పనిచేసే స్వచ్ఛంద సేవాసంస్థల్లో, కమ్యూనిటీ హెల్త్‌ ఆర్గనైజేషన్లలో, వృద్ధాశ్రమాల్లో కొలువుల్లో చేరొచ్చు. మీరు ఒకవేళ డిగ్రీ పూర్తి చేస్తే మాస్టర్స్‌ ఇన్‌ పబ్లిక్‌హెల్త్‌, ఎంబీఏ- హెల్త్‌కేర్‌ అండ్‌ హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌, మాస్టర్స్‌ ఇన్‌ ఆప్టోమెట్రీ లాంటి కోర్సులు చేసే అవకాశం ఉంది. ఆసక్తి ఉంటే మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ, ఫిజియోథెరపీ, కార్డియాలజీ, రేడియాలజీ, హెల్త్‌ సైకాలజీ, ఆడియాలజీ, స్పోర్ట్స్‌ మెడిసిన్‌ లాంటి వాటిలో సర్టిఫికెట్‌/ డిప్లొమాలు చేయండి. ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌ కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని