హైకోర్టులో ప్రాక్టీస్ చేసేదెలా?
బీఎల్ చివరి ఏడాది చదువుతున్నాను. హైకోర్టులో ప్రాక్టీస్ చేయాలనేది నా కోరిక.
బీఎల్ చివరి ఏడాది చదువుతున్నాను. హైకోర్టులో ప్రాక్టీస్ చేయాలనేది నా కోరిక. దీనికోసం జిల్లా కోర్టుల్లో న్యాయవాదిగా పనిచేసిన అనుభవం తప్పనిసరా? నేరుగా ప్రాక్టీస్ చేయొచ్చా?
రామకృష్ణ
- మీరు హైకోర్టులో ప్రాక్టీస్ చేయడానికి జిల్లా కోర్టుల్లో న్యాయవాదిగా పనిచేసిన అనుభవం అవసరం లేదు. సుప్రీం కోర్టులో పనిచేయాలంటే మాత్రం ఏదైనా కింది కోర్టులో కనీసం అయిదు సంవత్సరాల ప్రాక్టీసుతో పాటు సుప్రీం కోర్టు నిర్వహించే అడ్వకేట్ ఆన్ రికార్డ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి.
మీరు బీఎల్ పూర్తిచేసిన తరువాత, సంబంధిత రాష్ట్ర బార్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఆలిండియా బార్ ఎగ్జామినేషన్‌లో ఉత్తీర్ణత సాధించాలి. ఈ పరీక్షను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది. ఇది 100 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలతో మూడున్నర గంటల వ్యవధితో ఉంటుంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాక మీరు దేశంలో ఏ కోర్టులో అయినా ప్రాక్టీస్ చేయవచ్చు. ఈ పరీక్ష రాయడానికి వయః పరిమితి లేదు. దీన్ని ఎన్నిసార్లు అయినా రాయవచ్చు. ఆలిండియా బార్ ఎగ్జామినేషన్‌లో ఉత్తీర్ణత సాధించలేకపోతే.. మీరు ఏ కోర్టులో కూడా న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయడం సాధ్యం కాదు.
ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Nara Bhuvaneswari: ప్రజా ధనంపై మాకు ఎప్పుడూ ఆశ లేదు: భువనేశ్వరి
-
Cricketers AI Look: కోహ్లీ టు ధోనీ.. రెట్రో లుక్స్: ఏఐ మాయ అదుర్స్
-
Nara Lokesh: వైకాపా అధికారంలోకి వచ్చిన రోజు నుంచే అక్రమ కేసులు: నారా లోకేశ్
-
Janasena: తెలంగాణలో 32 చోట్ల జనసేన పోటీ.. జాబితా ఇదే
-
Chromebook: భారత్‌లో క్రోమ్‌బుక్‌ల తయారీ ప్రారంభం.. రూ.15,990కే కొత్త క్రోమ్‌బుక్!
-
Hyderabad: హోమ్‌వర్క్ చేయలేదని పలకతో కొట్టిన టీచర్.. బాలుడి మృతి