తక్కువ ఖర్చుతో ఫ్యాషన్‌ డిజైనింగ్‌..

ఇంటర్మీడియట్‌ (ఎంపీసీ) చదువుతున్నాను. ఫ్యాషన్‌ డిజైనింగ్‌ చేయాలనుంది. కానీ ఖర్చవుతుందని విన్నాను.

Published : 20 Sep 2023 00:10 IST

ఇంటర్మీడియట్‌ (ఎంపీసీ) చదువుతున్నాను. ఫ్యాషన్‌ డిజైనింగ్‌ చేయాలనుంది. కానీ ఖర్చవుతుందని విన్నాను. దీనికి ప్రత్యామ్నాయంగా ఏమైనా కోర్సు చదివి.. ఫ్యాషన్‌ డిజైనర్‌గా స్థిరపడొచ్చా?

లహరి

మీకు ఫ్యాషన్‌ డిజైనింగ్‌ రంగంలో ఆసక్తి ఉంటే ఫ్యాషన్‌కి సంబంధించిన సబ్జెక్టుల్లోనే డిగ్రీ చేసే ప్రయత్నం చేయండి. ఫీజు కట్టడం ఇబ్బందయితే బ్యాంకులో విద్యారుణం తీసుకొనే ప్రయత్నం చేయండి. ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఫీజు తక్కువ. అందుకని ప్రవేశ పరీక్షల్లో మెరుగైన మార్కులు పొంది ప్రభుత్వ కళాశాలల్లో సీటు తెచ్చుకొని, మెరిట్‌ స్కాలర్‌షిప్‌కోసం ప్రయత్నం చేయండి. ఫ్యాషన్‌ డిజైనింగ్‌ రంగంలో స్థిరపడాలనుకొంటే ఫ్యాషన్‌ డిజైన్‌, లెదర్‌ డిజైన్‌, యాక్సెసరీ డిజైన్‌, టెక్స్‌టైల్‌ డిజైన్‌, నిట్‌ వేర్‌ డిజైన్‌, ఫ్యాషన్‌ కమ్యూనికేషన్‌, అపారెల్‌ ప్రొడక్షన్‌ లాంటి స్పెషలైజేషన్లతో బీ డిజైన్‌/బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ లాంటి కోర్సులు చేయవచ్చు. వీటితో పాటు బీఎస్సీలో ఫ్యాషన్‌ డిజైన్‌, ఫ్యాషన్‌ మర్చెండైౖౖజింగ్‌ లాంటి కోర్సులూ చేయవచ్చు. మీకు ఆసక్తి ఉంటే.. ఫ్యాషన్‌ స్ట్టైలింగ్‌, ప్యాటర్న్‌ మేకింగ్‌, టెక్స్‌టైల్స్‌ ఫర్‌ ఇంటీరియర్స్‌ అండ్‌ ఫ్యాషన్‌, గార్మెంట్‌ కన్‌స్ట్రక్షన్‌, టైలరింగ్‌ అండ్‌ డిజైనింగ్‌ లాంటివాటిలో తక్కువ ఖర్చుతో సర్టిఫికెట్‌/ డిప్లొమా కోర్సులు కూడా చేసే అవకాశం ఉంది. ఫ్యాషన్‌ డిజైనింగ్‌ రంగంలో రాణించాలంటే సర్టిఫికెట్‌ మాత్రమే ఉంటే సరిపోదు. సాంకేతిక నైపుణ్యాలు, సృజనాత్మకత, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, నలుగురితో కలిసి పనిచేయగల సామర్థ్యం కూడా చాలా అవసరం.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు