ఎంబీఏ ఎక్కడ మేలు?

మా అబ్బాయి బీటెక్‌ (కెమికల్‌ ఇంజినీరింగ్‌) చేసి ఐసెట్‌కి సిద్ధమవుతున్నాడు. కొందరు టిస్‌నెట్‌, క్యాట్‌ లాంటివి రాయించమనీ, మరికొందరు విదేశీ ఎంబీఏ మేలనీ అంటున్నారు. మీ సలహా కావాలి.

Published : 27 Sep 2023 00:08 IST

మా అబ్బాయి బీటెక్‌ (కెమికల్‌ ఇంజినీరింగ్‌) చేసి ఐసెట్‌కి సిద్ధమవుతున్నాడు. కొందరు టిస్‌నెట్‌, క్యాట్‌ లాంటివి రాయించమనీ, మరికొందరు విదేశీ ఎంబీఏ మేలనీ అంటున్నారు. మీ సలహా కావాలి.

ఎస్‌.పద్మ

మీ అబ్బాయి తన కెరియర్‌ గురించి ఈ పాటికే ఒక నిర్ణయం తీసుకొనివుంటాడు. ఇంజినీరింగ్‌ పూర్తయ్యాక కూడా తల్లిదండ్రులు, బంధువులు కెరియర్‌ను నిర్ణయించడం శ్రేయస్కరం కాదు. ఎంటెక్‌ చేయాలా, ఎంబీఏ చేయాలా, ఎంబీఏ చేస్తే ఇండియా లోనా, విదేశాల్లోనా అనేవి అతనికే వదిలివేయడం మంచిది. తల్లిదండ్రులుగా అన్ని అవకాశాల్లో ఉన్న సాధకబాధకాలు చర్చించి నిర్ణయం మాత్రం తననే తీసుకోనివ్వండి.

ఐసెట్‌లో మంచి ర్యాంకు వస్తే రాష్ట్రంలో ఉన్న మంచి ఎంబీఏ కాలేజీల్లో మాత్రమే చదివే అవకాశం ఉంటుంది. టిస్‌నెట్‌లో మెరుగైన ప్రతిభ కనపరిస్తే టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌లో మాత్రమే చదివే అవకాశం ఉంటుంది. క్యాట్‌లో మంచి స్కోరు పొందితే ఐఐఎంల్లో, దేశంలో ఉన్న కొన్ని ప్రముఖ బిజినెస్‌ స్కూళ్లలో ప్రవేశం పొందవచ్చు. కొన్ని ప్రైవేటు బిజినెస్‌ స్కూల్స్‌ ప్రత్యేక ప్రవేశపరీక్షలు తామే నిర్వహించి ఎంబీఏ కోర్సులో అడ్మిషన్లు చేపడుతున్నాయి.

విదేశాల్లో ఎంబీఏ విషయానికొస్తే జీమ్యాట్‌ తోపాటు టోఫెల్‌/ఐఈఎల్‌టీఎస్‌లో మంచి స్కోరు పొంది, ప్రముఖ యూనివర్సిటీల్లో ప్రవేశానికి ప్రయత్నాలు చేయవచ్చు. సాధారణంగా విదేశాల్లో ఎంబీఏ చేయడానికి కనీసం రెండేళ్ల ఉద్యోగానుభవం ఉండటం మంచిది. ప్రపంచ ప్రఖ్యాత బిజినెస్‌ స్కూళ్లలో ఎంబీఏ చదవాలంటే కనీసం కోటి రూపాయలు ట్యూషన్‌ ఫీజు చెల్లించాలి. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోండి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని