డూన్‌ బిజినెస్‌ స్కూల్‌లో ప్రవేశం ఎలా?

ఇంటర్‌ (బైపీసీ) సెకండ్‌ ఇయర్‌ చదువుతున్నాను. డూన్‌ బిజినెస్‌ స్కూల్‌లో బీఎస్సీ అగ్రికల్చర్‌ చేయాలనుంది. ప్రవేశ పరీక్ష ఉంటుందా?

Published : 03 Oct 2023 00:03 IST

ఇంటర్‌ (బైపీసీ) సెకండ్‌ ఇయర్‌ చదువుతున్నాను. డూన్‌ బిజినెస్‌ స్కూల్‌లో బీఎస్సీ అగ్రికల్చర్‌ చేయాలనుంది. ప్రవేశ పరీక్ష ఉంటుందా?

దీప్తి

డూన్‌ బిజినెస్‌ స్కూల్‌, డెహ్రాడూన్‌లో బీఎస్సీ (ఆనర్స్‌) అగ్రికల్చర్‌ కోర్సు చదవడానికి  ప్రవేశ పరీక్ష రాయవలసిన అవసరం లేదు. ఇంటర్మీడియట్‌ మార్కులు, పర్సనల్‌ ఇంటర్వ్యూలో పొందిన మార్కుల ఆధారంగా మెరిట్‌ లిస్ట్‌ తయారుచేసి ప్రవేశాలు కల్పిస్తారు. అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థులకు మెరిట్‌ స్కాలర్‌ షిప్‌లూ ఉంటాయి. మరిన్ని వివరాలకోసం కాలేజీ వెబ్‌సైట్‌ని సందర్శించండి. కొన్ని వ్యవసాయ కళాశాలలు యూజీసీ/ ప్రభుత్వ గుర్తింపు ఉన్న యూనివర్సిటీకి అనుబంధంగా ఉండి, ఐసీఏఆర్‌ నిర్దేశించిన సిలబస్‌తో డిగ్రీ కోర్సులను అందిస్తున్నాయి. ఏదైనా అగ్రికల్చర్‌ కళాశాలలో బీఎస్సీ అగ్రికల్చర్‌ కోర్సులో చేరేముందు ఆ కోర్సుకు ఐసీఏఆర్‌ గుర్తింపు ఉందో, లేదో నిర్థరించుకోండి. వ్యవసాయ శాఖలో ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలకు ఐసీఏఆర్‌ గుర్తింపు ఉన్న డిగ్రీ అవసరం. కొన్ని ప్రైవేటురంగ సంస్థలు ఈ గుర్తింపు లేని డిగ్రీ చదివినవారికి కూడా ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు