విదేశీ భాష నేర్పించే వెబ్‌సైట్లు ఏవి?

ఇంజినీరింగ్‌ చదువుతూనే స్పానిష్‌ భాష నేర్చుకోవాలని అనుకోవడం అభినందనీయం. కనీసం ఒక విదేశీ భాషలో ప్రావీణ్యం సాధిస్తే మీ అంతర్జాతీయ ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి. చాలా విదేశీ భాషలను ఆన్‌లైన్‌ ద్వారా ఉచితంగా నేర్చుకొనే అవకాశం ఉంది.

Published : 30 Nov 2023 00:42 IST

బీటెక్‌ రెండో సంవత్సరం చదువుతున్నాను. స్పానిష్‌ భాషలో సర్టిఫికెట్‌ కోర్సు చేయాలనుంది. ఆన్‌లైన్‌లో ఈ భాషను ఉచితంగా నేర్పించే వెబ్‌సైట్ల వివరాలు చెబుతారా?

బి.హరిహర్‌

ఇంజినీరింగ్‌ చదువుతూనే స్పానిష్‌ భాష నేర్చుకోవాలని అనుకోవడం అభినందనీయం. కనీసం ఒక విదేశీ భాషలో ప్రావీణ్యం సాధిస్తే మీ అంతర్జాతీయ ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి. చాలా విదేశీ భాషలను ఆన్‌లైన్‌ ద్వారా ఉచితంగా నేర్చుకొనే అవకాశం ఉంది. స్పానిష్‌ భాషను యుడెమి, కోర్స్‌ ఎరా, ఎడ్‌ఎక్స్‌ల ద్వారా నేర్చుకోవచ్చు. ఇవే కాకుండా ప్రాక్టికల్‌ స్పానిష్‌ ఆన్‌లైన్‌, డుయో లింగో, మెమ్రైస్‌, బుసూ, ది ఓపెన్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌, ఆన్‌లైన్‌ ఫ్రీ స్పానిష్‌, బటర్‌ఫ్లై స్పానిష్‌, ఫ్లూయెంటూ, లోయెక్సన్‌, ఫ్యూచర్‌ లెర్న్‌, బాబ్బెల్‌, అలీసన్‌, స్టడీ స్పానిష్‌ డాట్‌ కామ్‌, ఎడ్యూరెవ్‌, ఎఫ్‌ఎస్‌ఐ స్పానిష్‌ ఇలా ఎన్నో వేదికలు ఉన్నాయి. వీటిలో మీకు నచ్చిన వెబ్‌సైట్‌ నుంచి స్పానిష్‌ భాషను నేర్చుకోండి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు