ఏజీ బీఎస్సీతో ఏ అవకాశాలు?

బీఎస్సీ (అగ్రికల్చర్‌) రెండో సంవత్సరం చదువుతున్నాను. ఈ కోర్సుతో ఉండే ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలు చెప్పండి.

Published : 04 Dec 2023 00:06 IST

బీఎస్సీ (అగ్రికల్చర్‌) రెండో సంవత్సరం చదువుతున్నాను. ఈ కోర్సుతో ఉండే ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలు చెప్పండి.

పెద్దిరెడ్డి

జీ బీఎస్సీ చదివినవారు అగ్రికల్చర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌, అగ్రికల్చర్‌ అనలిస్ట్‌, అసిస్టెంట్‌ ప్లాంటేషన్‌ మేనేజర్‌, సీడ్‌ ఆఫీసర్‌, ఫీల్డ్‌ ఆఫీసర్‌, అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌, ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌, ఫుడ్‌ టెక్నాలజిస్ట్‌, ప్లాంట్‌ బ్రీడర్‌ లాంటి ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు, అంతర్జాతీయ/ జాతీయ స్వచ్ఛంద సేవాసంస్థల్లో చాలా ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా పరిశోధన సంస్థలు, ఫుడ్‌ టెక్నాలజీ కంపెనీలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, విత్తన సంస్థలు, బ్యాంకులు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, అటవీ శాఖలు, ఫర్టిలైజర్‌ తయారీ సంస్థలు, అగ్రికల్చర్‌ టెక్నాలజీ సంస్థల్లో కొలువులు అందుబాటులో ఉంటాయి.

ఉన్నత విద్యావకాశాల విషయానికొస్తే - అగ్రికల్చర్‌, అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, ఫుడ్‌ సైన్స్‌, జెనెటిక్స్‌, ప్లాంట్‌ పాథాలజీ, అగ్రికల్చర్‌ ఎకనామిక్స్‌, ప్లాంట్‌ సైన్స్‌, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ల్లో పీజీ చేయొచ్చు. మీకు బోధన, పరిశోధన రంగాలపై ఆసక్తి ఉంటే పీజీ తరువాత పీహెచ్‌డీ కూడా చేసి అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌/ సైంటిస్ట్‌గా స్థిరపడవచ్చు.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని