ఎయిర్‌ హోస్టెస్‌ అవ్వాలని..

మా అమ్మాయి టెన్త్‌క్లాస్‌ చదువుతోంది. ఎయిర్‌హోస్టెస్‌ అవుతానంటోంది. సంబంధిత కోర్సు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడుంది?

Published : 05 Dec 2023 00:18 IST

మా అమ్మాయి టెన్త్‌క్లాస్‌ చదువుతోంది. ఎయిర్‌హోస్టెస్‌ అవుతానంటోంది. సంబంధిత కోర్సు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడుంది?

నరసింహారావు

మీ అమ్మాయిని టెన్త్‌ క్లాస్‌ తరువాత ఇంటర్మీడియట్‌ సైన్స్‌/ కామర్స్‌/ ఆర్ట్స్‌ చదివించండి. ఆ తర్వాత ఎయిర్‌ హోస్టెస్‌కు సంబంధించిన కళాశాల/ శిక్షణ సంస్థలో చేర్పించండి. ఎయిర్‌ హోస్టెస్‌ అవ్వాలంటే ఓర్పు, ఆత్మవిశ్వాసం, దృఢమైన వ్యక్తిత్వం, నాయకత్వ లక్షణాలు, బృందంలో పనిచేయడానికి కావాల్సిన నైపుణ్యాలు, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, ఇంగ్లిష్‌ కాకుండా కనీసం ఓ భారతీయ భాషలో ప్రావీణ్యం అవసరం. ఏదైనా విదేశీ భాష తెలిసి ఉంటే అదనపు అర్హత అవుతుంది.

ఇంటర్మీడియట్‌లో కనీసం 50 శాతం మార్కులు పొంది 17 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వయసుతో పాటు శారీరకంగా, మానసికంగా పూర్తి ఆరోగ్యంతో ఉండాలి. ఏవియేషన్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ హాస్పిటాలిటీ, ఏవియేషన్‌ కస్టమర్‌ సర్వీస్‌, ఎయిర్‌ హోస్టెస్‌ ట్రైనింగ్‌, ఎయిర్‌లైన్స్‌ హాస్పిటాలిటీ, క్యాబిన్‌ క్రూ, ఫ్లైట్‌ అటెండెంట్‌ లాంటి ఏదో ఒక కోర్సులో ఆరు నెలల నుంచి సంవత్సరం పాటు శిక్షణ పొందాలి. ఒకవేళ డిగ్రీ చదివి ఎయిర్‌ హోస్టెస్‌ అవ్వాలనుకొంటే బీఎస్సీ (ఎయిర్‌ హోస్టెస్‌), బ్యాచిలర్‌ ఆఫ్‌ హాస్పిటాలిటీ అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌, బీఎస్సీ ఏవియేషన్‌, బీబీఏ టూరిజం మేనేజ్‌మెంట్‌ లాంటి కోర్సులు చేయొచ్చు. ఎయిర్‌ హోస్టెస్‌ శిక్షణ సంస్థలు/ కాలేజీల విషయానికొస్తే- హైదరాబాద్‌, విశాఖపట్టణాల్లో చాలా ప్రైవేటు సంస్థలు అందుబాటులో ఉన్నాయి. ఏదైనా సంస్థ/ కాలేజీలో చేరేముందు దాని నాణ్యత, విశ్వసనీయత గురించి పూర్తిగా తెలుసుకొని సరైన నిర్ణయం తీసుకోండి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు