ఫార్మానా.. బయోటెక్నాలజీనా?

ఎమ్మెస్సీ మైక్రోబయాలజీ చదువుతున్నాను. ఈ కోర్సుతో ఫార్మా, బయోటెక్నాలజీ రంగాల్లో ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి?

Published : 21 Dec 2023 00:06 IST

ఎమ్మెస్సీ మైక్రోబయాలజీ చదువుతున్నాను. ఈ కోర్సుతో ఫార్మా, బయోటెక్నాలజీ రంగాల్లో ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి? ఈ రెండు రంగాల్లో దేన్ని ఎంచుకుంటే మంచిది?

ఎ.సాయిపవన్‌

మైక్రో బయాలజీ ప్రోగ్రాంలో సూక్ష్మ జీవుల గురించి విపులంగా చదువుతారు. ఫంగీ, బ్యాక్టీరియా, వైరస్‌, ప్రోటోజోవా, ఆల్గే లాంటివి. మైక్రో బయాలజీలో వైరాలజీ, బ్యాక్టీరియాలజీ, మైకాలజీ, ప్రోటో జువాలజీ, పారాసైటాలజీ లాంటి స్పెషలైజేషన్‌లు ఉంటాయి. మీరు ఎమ్మెస్సీ మైక్రోబయాలజీలో చదివిన స్పెషలైజేషన్‌ ఆధారంగా ఏ రంగంలో ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నాయో తెలుసుకొని, అవసరమైన నైపుణ్యాలు పెంచుకోండి. మైక్రోబయాలజీ చదివినవారికి ఫార్మా, బయోటెక్నాలజీ రంగాలతో పాటు ఫుడ్‌ ప్రాసెసింగ్‌, హెల్త్‌ కేర్‌, బయోమెడికల్‌ రంగాల్లోనూ ఉద్యోగావకాశాలు ఉన్నాయి. ఫార్మా, బయోటెక్‌.. రెండు రంగాల్లో మైక్రో బయాలజిస్ట్‌గా ఉద్యోగం పొందవచ్చు. ప్రస్తుతం ఫార్మా, బయోటెక్‌ పరిశ్రమలు రెండూ హెల్త్‌కేర్‌ రంగంతో పాటు దీటుగా అభివృద్ధి చెందుతున్నాయి. మీ ఆసక్తిని బట్టి దేనిలో స్థిరపడాలో నిర్ణయించుకొని ఆ రంగాన్ని ఎంచుకోండి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు