మాస్టర్స్‌ + ఎథికల్‌ హ్యాకింగ్‌.. ఎంత మేలు?

ఎంసీఏకు సిద్ధమవుతున్నాను. మాస్టర్స్‌ చేస్తూనే ఎథికల్‌ హ్యాకింగ్‌ శిక్షణ తీసుకుంటే ఎంసీఏపై ప్రభావం పడుతుందా?

Published : 26 Dec 2023 00:15 IST

ఎంసీఏకు సిద్ధమవుతున్నాను. మాస్టర్స్‌ చేస్తూనే ఎథికల్‌ హ్యాకింగ్‌ శిక్షణ తీసుకుంటే ఎంసీఏపై ప్రభావం పడుతుందా?

వి.భాను

ప్రస్తుతం ఉన్న ఉద్యోగ మార్కెట్‌లో డిగ్రీతో పాటు అదనంగా పొందిన నైపుణ్యాలతో ఉద్యోగావకాశాలు మెరుగ్గా ఉంటున్నాయి. ఏదైనా డిగ్రీ చదువుతూ, ఆ డిగ్రీకి సంబంధించిన ఇతర కోర్సులు నేర్చుకోవడం వల్ల లాభమే కానీ, నష్టం ఉండదు. ఎంసీఏతో పాటు హ్యాకింగ్‌లో శిక్షణ పొందడం వల్ల సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి. ఎథికల్‌ హ్యాకింగ్‌పై పట్టున్నవారి సంఖ్య తక్కువగా ఉండటం వల్ల ఆ కోర్సులో శిక్షణ పొందినవారికి డిమాండ్‌ ఉంది. కానీ మీరు రెగ్యులర్‌గా చదవబోయే ఎంసీఏను అశ్రద్ధ చేయకూడదు. రెండింటినీ సమన్వయం చేస్తూ విషయ పరిజ్ఞానాన్ని, ప్రోగ్రామింగ్‌ నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. అదే సమయంలో హ్యాకింగ్‌లో మెలకువలను కూడా నేర్చుకొని, అందులో సర్టిఫికేషన్‌ పొందితే పేరున్న సంస్థలో ఆకర్షణీయ వేతనంతో ఉద్యోగం లభిస్తుంది.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు