ఇంటర్‌తో ఏయే కొలువులు?

ఇంటర్మీడియట్‌ (ఎంపీసీ) పాసై ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాను. ఈ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి? 

Published : 04 Jan 2024 00:24 IST

ఇంటర్మీడియట్‌ (ఎంపీసీ) పాసై ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాను. ఈ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి?   

 - వంశీ

 ఇంటర్మీడియట్‌ పాసైనవారికి ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌, ఆర్మీ, నేవీ, పోస్టల్‌ విభాగం, రైల్వేస్‌, బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌, సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌, సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌లలో ఉద్యోగావకాశాలుంటాయి. మీరు స్టెనోగ్రఫీ/కంప్యూటర్‌/ ఆఫీస్‌ మేనేజ్‌మెంట్‌లో సర్టిఫికెట్‌, డిప్లొమా లాంటి కోర్సులు చేసినట్లయితే ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి. సాధారణంగా ఇంటర్మీడియట్‌ విద్యార్హతతో లోయర్‌ డివిజనల్‌ క్లర్క్‌, పోస్టల్‌ అసిస్టెంట్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌, సార్టింగ్‌ అసిస్టెంట్‌, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌, జనరల్‌ డ్యూటీ కానిస్టేబుల్‌, స్టెనోగ్రాఫర్‌, అసిస్టెంట్‌ లోకో పైలట్‌ లాంటి ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి. వీటి కోసం ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ పరీక్షలు, ఆల్‌ ఇండియా డిఫెన్స్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్స్‌ లాంటివి రాయవలసి ఉంటుంది.

 ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని