ఫిజియోథెరపిస్ట్‌ అయ్యేదెలా?

ఇంటర్‌ (బైపీసీ) రెండో సంవత్సరం చదువుతున్నాను. ఫిజియోథెరపీ డిగ్రీ చదవాలనుంది. ఆ తర్వాత స్పోర్ట్స్‌ సెంటర్లలో ఫిజియోథెరపిస్ట్‌గా ఉద్యోగం చేయాలనుంది.

Updated : 10 Jan 2024 00:10 IST

ఇంటర్‌ (బైపీసీ) రెండో సంవత్సరం చదువుతున్నాను. ఫిజియోథెరపీ డిగ్రీ చదవాలనుంది. ఆ తర్వాత స్పోర్ట్స్‌ సెంటర్లలో ఫిజియోథెరపిస్ట్‌గా ఉద్యోగం చేయాలనుంది. దీనికోసం ఏ పరీక్షలు రాయాలి?

డేవిడ్‌

ఫిజియోథెరపీ కోర్సు చదవాలంటే మీరు ముందుగా ఇంటర్మీడియట్‌లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఆ తరువాత ఈ కోర్సు నోటిఫికేషన్‌ వచ్చాక దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్మీడియట్‌లో పొందిన మార్కుల ఆధారంగా ఈ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. మంచి బోధన ఉన్న కళాశాలను ఎంచుకొని, కోర్సును బాగా చదివి మంచి మార్కులతో  ఉత్తీర్ణత పొందాలి. ఆపై స్పోర్ట్స్‌ స్పెషలైజేషన్‌తో మాస్టర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ కోర్సు చేయాలి. నిమ్స్‌లో ఫిజియోథెరపీ కోర్సులకు ఆ సంస్థ నిర్వహించే ప్రత్యేక ప్రవేశపరీక్ష రాయాలి.

స్వామి వివేకానంద నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిహాబిలిటేషన్‌ ట్రైనింగ్‌ అండ్‌ రిసెర్చ్‌ - ఒడిశా, ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిజికల్‌ మెడిసిన్‌ అండ్‌ రిహాబిలిటేషన్‌- ముంబై లాంటి జాతీయ విద్యాసంస్థల్లో ఫిజియో థెరపీలో యూజీ/ పీజీ కోర్సు చదవాలంటే, ఆ సంస్థలు నిర్వహించే ప్రత్యేక ప్రవేశపరీక్షల్లో మెరుగైన ప్రతిభ కనపర్చాలి. మాస్టర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీలో స్పోర్ట్స్‌ స్పెషలైజేషన్‌ పూర్తిచేసి ఏదైనా స్పోర్ట్స్‌ సెంటర్‌లో ఫిజియోథెరపిస్ట్‌గా కొంతకాలం పనిచేసి, మంచి నైపుణ్యాలు పొందితే.. మీరే సొంతంగా ఫిజియోథెరపీ కేంద్రం స్థాపించవచ్చు.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు