ఆప్టోమెట్రీతో ఉపాధి ఎలా?

ఆప్ట్టోమెట్రీ డిప్లొమా రెండో ఏడాది చదువుతున్నా. తర్వాత బీఎస్సీ ఆప్ట్టోమెట్రీ చేయాలనుంది. డిప్లొమా చేసినవారికి లేటరల్‌ ఎంట్రీ ఉంటుందా?

Published : 11 Jan 2024 00:08 IST

ఆప్ట్టోమెట్రీ డిప్లొమా రెండో ఏడాది చదువుతున్నా. తర్వాత బీఎస్సీ ఆప్ట్టోమెట్రీ చేయాలనుంది. డిప్లొమా చేసినవారికి లేటరల్‌ ఎంట్రీ ఉంటుందా? ప్రభుత్వ ఉద్యోగావకాశాలుంటాయా?

బి.మణికంఠ మహారాజ్‌

ప్టోమెట్రీలో డిప్లొమా చేసినవారికి భారతీ విద్యాపీఠ్‌- పుణె, డీ…వై పాటిల్‌ యూనివర్సిటీ- పుణెల్లో, బీఎస్సీ ఆప్టోమెట్రీలో లేటరల్‌ ఎంట్రీ ఉంది. ఇంటర్మీడియట్‌/ ఆప్టోమెట్రీ డిప్లొమా విద్యార్హతతో యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ మాస్టర్‌ ఆఫ్‌ ఆప్టోమెట్రీ కోర్సు అందుబాటులో ఉంది. ఈ కోర్సులో నాలుగేళ్ల తర్వాత గ్రాడ్యుయేషన్‌ డిగ్రీతో బయటికి కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. ఎల్‌వీ ప్రసాద్‌ ఐ హాస్పిటల్‌తోపాటు హైదరాబాద్‌లో మరో రెండు ప్రైవేటు యూనివర్సిటీలు ఆప్టోమెట్రీలో డిగ్రీ కోర్సులు అందిస్తున్నాయి. ఈ కోర్సు చదివినవారికి ప్రభుత్వ రంగంతో పోలిస్తే, ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల విషయానికొస్తే- ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, ప్రాంతీయ కంటి ఆసుపత్రుల్లో, వైద్య కళాశాలల్లో అతి తక్కువ సంఖ్యలో ఉద్యోగావకాశాలు ఉన్నాయి. ఉన్నత విద్యపై ఆసక్తి ఉంటే ఆప్టోమెట్రీలో పీజీ/ పీహెచ్‌డీతో బోధన, పరిశోధన రంగాల్లో స్థిరపడవచ్చు.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు