బీకాంతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం?

బీకాం చదివాను. యూపీఎస్‌సీ పరీక్షలకు మూడేళ్లు ప్రయత్నించి వదిలేశాను. ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేయాలనుంది. ఏ కోర్సులు చదివితే మంచిది?

Updated : 15 Jan 2024 04:05 IST

బీకాం చదివాను. యూపీఎస్‌సీ పరీక్షలకు మూడేళ్లు ప్రయత్నించి వదిలేశాను. ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేయాలనుంది. ఏ కోర్సులు చదివితే మంచిది?

వంశీకృష్ణ

సాఫ్ట్‌వేర్‌ రంగంలోకి ప్రవేశించేముందు మీరు కంప్యూటర్‌ రంగానికి సంబంధించిన ప్రాథ]మిక అంశాలైన ఆపరేటింగ్‌ సిస్టమ్‌, కంప్యూటర్‌ ఆర్కిటెక్చర్‌, డేటా స్ట్రక్చర్స్‌, డేటాబేస్‌ మేనేజ్‌మెంట్‌, కోడింగ్‌లతో పాటు ఎంఎస్‌ ఆఫీస్‌పై పట్టు సాధించాలి. బీకాం చదివినవారు సాఫ్ట్‌వేర్‌ రంగంలోకి ప్రవేశించాలంటే చాలా రకాల కోర్సులు చదివే అవకాశం ఉంది. వాటిలో ముఖ్యంగా- బిజినెస్‌ అనలిటిక్స్‌, డేటా సైన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌, ఎస్‌క్యూఎల్‌ డీబీఏ, సిక్స్‌ సిగ్మా, డిజిటల్‌ మార్కెటింగ్‌, వెబ్‌ డిజైనింగ్‌, సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, సైబర్‌ సెక్యూరిటీ, గ్రాఫిక్‌ డిజైన్‌, హార్డ్‌వేర్‌ అండ్‌ నెట్‌ వర్కింగ్‌, వీఎఫ్‌ఎక్స్‌ అండ్‌ యానిమేషన్‌, ఐఓఎస్‌ డెవలప్‌మెంట్‌, ఎస్‌ఏపీ, ఈఆర్‌పీ లాంటి వాటికి ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీటితో పాటు వివిధ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌ కూడా నేర్చుకొని ఉద్యోగ ప్రయత్నాలు చేయవచ్చు. పైన పేర్కొన్నవాటిల్లో నచ్చిన కోర్సు ఎంచుకని, కనీసం ఒక సంవత్సరం పాటు కృషి చేస్తే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని