నోటీసు బోర్డు

కర్ణాటక రాష్ట్రం మంగళూరులోని ఓఎన్‌జీసీ అనుబంధ సంస్థ- మంగళూరు రిఫైనరీ అండ్‌ పెట్రోకెమికల్స్‌ లిమిటెడ్‌ (ఎంఆర్‌పీఎల్‌) ఈ2 గ్రేడులో 27 అసిస్టెంట్‌ ఇంజినీర్‌, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఖాళీల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Published : 18 Jan 2024 00:08 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

మంగళూరు రిఫైనరీలో ..  

కర్ణాటక రాష్ట్రం మంగళూరులోని ఓఎన్‌జీసీ అనుబంధ సంస్థ- మంగళూరు రిఫైనరీ అండ్‌ పెట్రోకెమికల్స్‌ లిమిటెడ్‌ (ఎంఆర్‌పీఎల్‌) ఈ2 గ్రేడులో 27 అసిస్టెంట్‌ ఇంజినీర్‌, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఖాళీల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

 విభాగాలు: కెమికల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, కంప్యూటర్‌ సైన్స్‌.

 అర్హత: సంబంధిత ఇంజినీరింగ్‌ విభాగంలో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీతో పాటు గేట్‌ 2023 స్కోరు.
వయసు: 27 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు రుసుము: రూ.118 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది).
ఎంపిక: గేట్‌-2023 మార్కులు, గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తు ముగింపు తేదీ: 10/02/2024.
వెబ్‌సైట్‌: https://www.mrpl.co.in/careers


అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పోస్టులు  

మంగళూరు రిఫైనరీ అండ్‌ పెట్రో కెమికల్స్‌ లిమిటెడ్‌ (ఎంఆర్‌పీఎల్‌) 4 అసిస్టెంట్‌ ఇంజినీర్‌ ఖాళీల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
విభాగాలు: ఫైర్‌, సెక్రటేరియల్‌, సేఫ్టీ.
అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీ (ఫైర్‌/ఫైర్‌ అండ్‌ సేఫ్టీ), ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇండియాలో అసోసియేట్‌ మెంబర్‌షిప్‌, డిగ్రీతో పాటు ఇండస్ట్రియల్‌ సేఫ్టీలో పీజీ డిప్లొమా.
వయసు: 27 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు రుసుము: రూ.118 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది).
ఆన్‌లైన్‌ దరఖాస్తు ముగింపు తేదీ: 10/02/2024.
వెబ్‌సైట్‌: https://www.mrpl.co.in/


వాక్‌ఇన్‌

డీఎంఎస్‌ఆర్‌డీఈలో..

కాన్పుర్‌లోని డిఫెన్స్‌ మెటీరియల్స్‌ అండ్‌ స్టోర్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (డీఎంఎస్‌ఆర్‌డీఈ)- తాత్కాలిక ప్రాతిపదికన 5 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  •  రిసెర్చ్‌ అసోసియేట్‌షిప్‌: 01
  • జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌: 04

అర్హతలు: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ, నెట్‌/ గేట్‌ స్కోరు.
వయసు: రిసెర్చ్‌ అసోసియేట్‌షిప్‌కు 35 ఏళ్లు, జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌కు 28 సంవత్సరాలు మించకూడదు.
వేతనం: నెలకు రిసెర్చ్‌ అసోసియేట్‌షిప్‌కు రూ.67,000, జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌కు రూ.37,000.
ఇంటర్వ్యూ తేదీ: 24-01-2024.
ప్రదేశం: డీఎంఎస్‌ఆర్‌డీఈ ట్రాన్సిట్‌ ఫెసిలిటీ, జీటీ రోడ్‌, కాన్పుర్‌.
వెబ్‌సైట్‌: https://www.drdo.gov.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని