మలంగట్టిగా, నల్లగా..

నా వయసు 58 సంవత్సరాలు. మధుమేహం, అధిక రక్తపోటు ఉన్నాయి. మల విసర్జన చేస్తున్నప్పుడు నొప్పి పుడుతుంది. ...

Published : 01 Oct 2019 01:04 IST

సమస్య - సలహా

సమస్య: నా వయసు 58 సంవత్సరాలు. మధుమేహం, అధిక రక్తపోటు ఉన్నాయి. మల విసర్జన చేస్తున్నప్పుడు నొప్పి పుడుతుంది. మలం రాయిలా గట్టిగా, నల్లగా ఉంటుంది. ఒకోసారి మలం చేత్తో బయటకు తీయాల్సి వస్తుంది. మూత్రం పోసినప్పుడు తెల్లగా నురగ కనిపిస్తుంది. ఇవి తగ్గేదెలా? ఏవైనా పరీక్షలు చేయించుకోవాలా? దయచేసి చెప్పండి.

- కె.రవిశంకర్‌, విజయవాడ

సలహా: మీరు చెప్పిన వివరాలను బట్టి చూస్తుంటే ఆహారపరంగా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు కనిపించటం లేదు. పీచు, నీళ్లు తగినంతగా తీసుకోకపోతే మలం గట్టిపడటం, మలబద్ధకం తలెత్తే ప్రమాదముంది. మలం గట్టిగా వస్తే మలద్వారం వద్ద కండరాలు ఒరుసుకు పోయి నొప్పి పుడుతుంది. మొలల సమస్యకూ దారితీయొచ్ఛు విసర్జన సాఫీగా అయ్యేలా చూసుకుంటే వీటిని తప్పించుకోవచ్ఛు అందువల్ల మీరు ముందుగా పీచుతో కూడిన ఆకు కూరలు, పండ్లు ఎక్కువగా తినటం మొదలెట్టండి. మీకు మధుమేహం ఉంది కాబట్టి పండ్ల విషయంలో జాగ్రత్త అవసరం. కమలాలు, బత్తాయి, జామ పండ్లు, యాపిల్‌, బొప్పాయి వంటివి తీసుకోవచ్ఛు వీటిని రోజువారీ ఆహారంలో విధిగా చేర్చుకోవాలి. అలాగే తగినంత నీరు తాగటం తప్పనిసరి. మీరు మధుమేహం, అధిక రక్తపోటు ఉన్నాయని అంటున్నారు. మధుమేహంతోనూ పేగుల కదలికలు తగ్గిపోయి మలబద్ధకం రావొచ్ఛు అధిక రక్తపోటుకు వేసుకునే మందుల్లో కొన్ని మూత్రం ఎక్కువగా వచ్చేలా చేస్తాయి. దీంతోనూ మలబద్ధకం తలెత్తొచ్ఛు థైరాయిడ్‌ సమస్య, ఒంట్లో క్యాల్షియం ఎక్కువగా ఉన్నా మలం గట్టిగా అవ్వచ్ఛు ఒకసారి రక్త పరీక్ష చేయించుకోవటం మంచిది. ఇలాంటి సమస్యలున్నట్టు తేలితే తగు చికిత్స తీసుకోవాలి. మలం నల్లగా వస్తోందంటే పేగుల్లో ఎక్కడైనా రక్తస్రావం అవుతుండొచ్ఛు అది మలంతో కలిసిపోయి వస్తుండొచ్ఛు మల పరీక్ష చేస్తే కారణమేంటన్నది తెలుస్తుంది. అల్సర్‌, పేగుపూత వంటి సమస్యలేవైనా ఉన్నట్టు తేలితే తగు చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. మూత్రం పోసినప్పుడు నురగ వస్తోందనీ అంటున్నారు. మూత్రంలో సుద్ద (అల్బుమిన్‌) పోతుంటే ఇలా కనిపించొచ్ఛు మూత్ర పరీక్షలో ఇది బయటపడుతుంది. ఫాస్ఫరస్‌ వంటి లవణాల స్ఫటికాలు, ఇన్‌ఫెక్షన్‌ ఉన్నా తెలుస్తుంది. మీరు తాత్సారం చేయకుండా నిపుణులైన డాక్టర్‌ను సంప్రదిస్తే.. ఆయా లక్షణాలను బట్టి ఏం చేయాలన్నది సూచిస్తారు.

మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను పంపాల్సిన చిరునామా

సమస్య - సలహా సుఖీభవ ఈనాడు ప్రధాన కార్యాలయం,

రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512

email: sukhi@eenadu.in

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని