కరోనా వ్యాప్తి ఎప్పుడెక్కువ?

ఒంట్లో నలతగా ఉందా? ఏదో నిస్సత్తువలా, కొద్దిపాటి జ్వరంగా అనిపిస్తోందా? అయితే ఐదారు రోజుల పాటు ఇతరులతో కలవకుండా విడిగా ఉండటం మంచిది.

Published : 07 Sep 2021 01:10 IST

ఒంట్లో నలతగా ఉందా? ఏదో నిస్సత్తువలా, కొద్దిపాటి జ్వరంగా అనిపిస్తోందా? అయితే ఐదారు రోజుల పాటు ఇతరులతో కలవకుండా విడిగా ఉండటం మంచిది. ఎందుకంటే ఇవి కొవిడ్‌-19 లక్షణాలు కావొచ్చు. ఈ సమయంలోనే.. అంటే లక్షణాలు బయటపడటానికి రెండు రోజుల ముందు నుంచి లక్షణాలు బయటపడ్డాక మూడు రోజుల వరకు వైరస్‌ ఎక్కువగా వ్యాపిస్తున్నట్టు బోస్టన్‌ యూనివర్సిటీ తాజాగా గుర్తించింది. ఎవరైనా నలతగా ఉందంటే వెంటనే ర్యాపిడ్‌ పరీక్ష చేసి, విడిగా ఉంచటం ముఖ్యమనే విషయాన్ని ఈ అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి. గత అధ్యయనాల్లో వైరస్‌ సంఖ్యను వ్యాప్తికి పరోక్ష ప్రమాణంగా తీసుకున్నారు. లక్షణాలు ఆరంభం కావటానికి కొద్ది రోజుల ముందు, తర్వాత ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నట్టు గుర్తించారు. తాజా అధ్యయనంలో దీన్ని మరింత కచ్చితంగా లెక్కించారు. ఎప్పుడెప్పుడు వైరస్‌ ఎక్కువగా వ్యాపిస్తోందనేది తేల్చారు. తొలిసారి ఇన్‌ఫెక్షన్‌ బారినపడి, లక్షణాలు లేనివారి నుంచి వైరస్‌ సోకినవారిలోనూ లక్షణాలేవీ ఉండటం లేదనీ బయటపడింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని