కిడ్నీజబ్బులో  బరువు హెచ్చుతగ్గులా?

దీర్ఘకాల కిడ్నీజబ్బుతో (సీకేడీ) బాధపడుతున్నారా? తరచూ బరువు పెరుగుతూ తగ్గుతోందా? అయితే కాస్త జాగ్రత్తగా ఉండండి. దీర్ఘకాల కిడ్నీజబ్బు బాధితుల్లో శరీర ఎత్తు, బరువుల నిష్పత్తి (బీఎంఐ) హెచ్చుతగ్గులతో...

Updated : 21 Sep 2021 05:09 IST

దీర్ఘకాల కిడ్నీజబ్బుతో (సీకేడీ) బాధపడుతున్నారా? తరచూ బరువు పెరుగుతూ తగ్గుతోందా? అయితే కాస్త జాగ్రత్తగా ఉండండి. దీర్ఘకాల కిడ్నీజబ్బు బాధితుల్లో శరీర ఎత్తు, బరువుల నిష్పత్తి (బీఎంఐ) హెచ్చుతగ్గులతో గుండెజబ్బులు, అకాల మరణం ముప్పు పెరుగుతున్నట్టు దక్షిణ కొరియా అధ్యయనంలో బయటపడింది. సాధారణగా బీఎంఐ హెచ్చుతగ్గులు గుండెజబ్బులకు దారితీస్తుంటాయి. సీకేడీ బాధితుల్లో మరణానికి గుండెజబ్బు ప్రధాన కారణంగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో పరిశోధకులు వీరిలో బీఎంఐ తీరుతెన్నులపై దృష్టి సారించారు. సీకేడీ బారినపడ్డ 84,636 మందిని నాలుగేళ్ల పాటు పరిశీలించారు. వీరిలో 6% మంది మరణించగా, 4% మందికి డయాలసిస్‌ అవసరమైంది. ఇక 2% మందికి గుండెపోటు, 3% మందికి పక్షవాతం వచ్చింది. బీఎంఐ హెచ్చుతగ్గులు తక్కువగా ఉన్నవారితో పోలిస్తే ఎక్కువగా ఉన్నవారికి మరణించే ముప్పు 66% అధికంగా ఉంటున్నట్టు బయటపడింది. డయాలసిస్‌ అవసరం 20%.. గుండెపోటు, పక్షవాతం ముప్పులు 19% పెరుగుతున్నట్టు వెల్లడైంది. అందుకే కిడ్నీలు దెబ్బతిన్నవారు బరువు హెచ్చుతగ్గులపై ఓ కన్నేసి ఉంచాలని పరిశోధకులు సూచిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని