టీకాల సామర్థ్యానికి యాంటీబయాటిక్స్‌ కళ్లెం!

శిశువులకు తొలి ఆరు నెలల్లో రకరకాల టీకాలు ఇస్తుండటం తెలిసిందే. రెండో ఏడాదిలో బూస్టర్‌ మోతాదులూ ఇస్తుంటారు. అయితే ఇవి అందరిలో అంతే సమర్థంగా పనిచేయకపోవచ్చు. ఇందుకు వివిధ

Published : 31 May 2022 00:35 IST

శిశువులకు తొలి ఆరు నెలల్లో రకరకాల టీకాలు ఇస్తుండటం తెలిసిందే. రెండో ఏడాదిలో బూస్టర్‌ మోతాదులూ ఇస్తుంటారు. అయితే ఇవి అందరిలో అంతే సమర్థంగా పనిచేయకపోవచ్చు. ఇందుకు వివిధ కారణాలు ఉండొచ్చు. యాంటీబయాటిక్‌ మందుల వాడకమూ వీటిల్లో ఒకటని తాజా అధ్యయనంలో బయటపడింది. రెండేళ్ల లోపు వయసులో యాంటీబయాటిక్‌ మందుల చికిత్స తీసుకున్నవారిలో పోలియో, డీపీటీ, హిమోఫిలస్‌ ఇన్‌ఫ్లూయెంజా టైప్‌ బి, న్యుమోనియా టీకాలకు రోగనిరోధక ప్రతిస్పందన తక్కువగా ఉంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. వీరిలో ఆయా టీకాలతో పుట్టుకొచ్చే యాంటీబాడీల మోతాదులు తక్కువగా ఉంటుండటం గమనార్హం. ఒకసారి యాంటీబయాటిక్‌ చికిత్స తీసుకున్న పిల్లలతో పోలిస్తే ఎక్కువసార్లు తీసుకున్న పిల్లల్లో యాంటీబాడీలు మరింత తక్కువగా ఉంటున్నట్టూ బయటపడింది. యాంటీబయాటిక్‌ మందులతో పిల్లల పేగుల్లోని బ్యాక్టీరియా వైవిధ్యం అస్తవ్యస్తం కావటం దీనికి కారణమవుతుండొచ్చని భావిస్తున్నారు. పిల్లలకు అతిగా యాంటీబయాటిక్‌ మందులు వాడటం తగదనే విషయాన్ని అధ్యయన ఫలితాలు మరోసారి నొక్కిచెబుతున్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు