‘ఫిట్‌నెస్’ పొరపాట్లు చేయొద్దు
శరీర సామర్థ్యం (ఫిట్‌నెస్) బాగుంటే ఆరోగ్యమూ బాగుంటుంది. దీనికి వ్యాయామం ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే దీన్ని సక్రమంగా చేయటం ముఖ్యం.
* చిన్నా చితకా కారణాలతో వ్యాయామాన్ని ఆపటం తగదు. దీంతో ఫిట్‌నెస్ లక్ష్యాన్ని చేరుకోవటం కష్టమవుతుంది. అప్పటివరకూ సాధించిన పురోగతి వెనక పడుతుంది.
* వ్యాయామాలకు ఉపక్రమించటానికి రెండు గంటల ముందు భోజనం చేస్తే కండరాలకు తగినంత రక్తం సరఫరా కాదు. దీంతో వ్యాయామ బడలిక నుంచి కోలుకోవటం కష్టమవుతుంది. కండరాలు పట్టేయటం, వికారానికి దారితీస్తుంది.
* ముందుగా సన్నద్ధ వ్యాయామాలు చేయటమూ ముఖ్యమే. దీంతో శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. రక్త సరఫరా పుంజుకుంటుంది. ఫలితంగా కండరాలు వదులవుతాయి. తేలికగా కదులుతాయి.
* కండరాలను సాగదీసే సమయంలో కుదురుగా, స్థిరంగా ఉండటం తప్పనిసరి. అటూఇటూ కదులుతున్నట్టయితే కండరాలు నొప్పి పుడతాయి. బిగుతుగా అవుతాయి. శరీరాన్ని సాగదీసిన ప్రతిసారీ 20 నుంచి 30 సెకండ్ల పాటు అదే భంగిమలో ఉండాలి.
* సరైన భంగిమలో ఉండేలా చూసుకోవటం ప్రధానం. లేకపోతే కింద పడిపోవచ్చు, గాయాలు కావొచ్చు. ఉదాహరణకు- ట్రెడ్‌మిల్ మీద నడిచేటప్పుడు పరికరం మీద వాలిపోవద్దు. శరీరం తిన్నగా ఉండేలా చూసుకోవాలి. బరువులు ఎత్తేటప్పుడు వెన్నెముకను తిన్నగా.. భుజాలు వెనక్కి, విశ్రాంతిగా ఉంచాలి. మోకాళ్లను మరీ బిగుతుగా పట్టి ఉంచొద్దు.
* కొన్నిరకాల వ్యాయామాలు చేస్తున్నప్పుడు సహజంగానే ఊపిరి బిగపడుతుంటారు. ఇది తగదు. ఊపిరి బిగపడితే శరీరానికి ఆక్సిజన్ తగ్గుతుంది. కాబట్టి బరువులు ఎత్తుతున్నప్పుడు ముందే గట్టిగా శ్వాస తీసుకోవాలి. నెమ్మదిగా బయటకు వదలాలి.
* సామర్థ్యాన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. శక్తికి మించి బరువులు ఎత్తితే నొప్పులు మొదలవుతాయి. మొత్తానికే వ్యాయామాలను ఆపేయాల్సి రావొచ్చు. ఒకవేళ ఎక్కువ బరువులు ఎత్తాలనుకుంటే ఒకేసారి కాకుండా కొద్దికొద్దిగా పెంచుకుంటూ రావాలి. అనువుగా అనిపించినప్పుడే అదనపు బరువును జోడించుకోవాలి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
America: ‘ఆయుధాలు ఇచ్చి ఆహారధాన్యాలు తీసుకో’.. రష్యా తీరుపై అమెరికా ఆందోళన..!
-
India News
Chandigarh University: పరీక్షలో పాటలే సమాధానాలు.. లెక్చరర్ కామెంట్‌కు నవ్వులే నవ్వులు
-
India News
Plant Fungi: మనిషికి సోకిన ‘వృక్ష శీలింధ్రం’.. ప్రపంచంలోనే తొలి కేసు భారత్‌లో!
-
Crime News
AI Chatbot: వాతావరణ మార్పులపై ఏఐ చాట్‌బాట్ రిజల్ట్.. ఆందోళనతో వ్యక్తి ఆత్మహత్య!
-
Movies News
Aditya Om: ఇంకా బతికే ఉన్నారా? అని కామెంట్ చేసేవారు: ఆదిత్య ఓం
-
Politics News
Yediyurappa: వరుణ నుంచి కాదు.. నా సీటు నుంచే విజయేంద్ర పోటీ: యడియూరప్ప క్లారిటీ!