ముక్కు.. ఆరోగ్య మార్గం!

ముక్కు కేవలం శ్వాస మార్గమే కాదు. ఇదో ఎయిర్‌ కండిషనర్‌, హీటర్‌, ఫిల్టర్‌, మాయిశ్చరైజర్‌ కూడా! ముక్కు రంధ్రాల గోడలకు సన్నటి ముతక వెంట్రుకలుంటాయి. ఇవి మనం పీల్చుకున్న గాలిలోని దుమ్ముధూళి వంటి వాటిని ఫిల్టర్‌

Updated : 15 Feb 2022 01:26 IST

ముక్కు కేవలం శ్వాస మార్గమే కాదు. ఇదో ఎయిర్‌ కండిషనర్‌, హీటర్‌, ఫిల్టర్‌, మాయిశ్చరైజర్‌ కూడా! ముక్కు రంధ్రాల గోడలకు సన్నటి ముతక వెంట్రుకలుంటాయి. ఇవి మనం పీల్చుకున్న గాలిలోని దుమ్ముధూళి వంటి వాటిని ఫిల్టర్‌ మాదిరిగా వడపోస్తాయి. జిగురుపొరలేమో దుమ్ముధూళి ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా పట్టి ఉంచుతాయి, గాలిలో తేమను నింపుతాయి, ఉష్ణోగ్రతను నియంత్రిస్తాయి. ఇవన్నీ జరిగాకే గాలి ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. ముక్కు రంధ్రాల్లోని గోడల పైభాగాన సుమారు 50 లక్షల నాడీ గ్రాహకాలు  ఉంటాయి. ఇవి మెదడులో కొన్నిచోట్ల ప్రచోదనాలను ప్రేరేపిస్తాయి. శ్వాస తీసుకున్న ప్రతీసారీ ముక్కులోకి వెళ్లిన గాలి ప్రవాహం జిగురు పొరల అడుగున ఉండే స్వయంచాలిత నాడీ కేంద్రాలను ప్రేరేపిస్తుంది. ఇవి శ్వాసక్రియ, జీర్ణక్రియ, రక్తప్రసరణ వంటి స్వయంచాలిత ప్రక్రియల మీద ప్రభావం చూపుతాయి. ఇలా ముక్కు మన శారీరక, మానసిక, భావోద్వేగ స్థితుల పైనా నేరుగా ప్రభావం చూపుతుంది. అందుకే ప్రాణాయామం వంటి శ్వాస నియంత్రణ పద్ధతులు ఆరోగ్య సంరక్షణకు ఎంతగానో తోడ్పడతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని