ఆందోళనకు రక్త పరీక్ష!

ఆందోళన (యాంగ్జయిటీ) సమస్య తరచూ చూసేదే. కొందరిలో ఇది రోజువారీ వ్యవహారాలకూ విఘాతం కలిగిస్తుంటుంది. దీన్ని ప్రస్తుతం మాట్లాడటం ద్వారానే గుర్తిస్తున్నారు.

Published : 14 Mar 2023 01:28 IST

ఆందోళన (యాంగ్జయిటీ) సమస్య తరచూ చూసేదే. కొందరిలో ఇది రోజువారీ వ్యవహారాలకూ విఘాతం కలిగిస్తుంటుంది. దీన్ని ప్రస్తుతం మాట్లాడటం ద్వారానే గుర్తిస్తున్నారు. ఇలా ఆందోళనకు గురయ్యేవారి భావాలను తెలుసుకుంటున్నారు. మందులను సూచిస్తున్నారు. అయితే కొన్ని మందులు అలవాటయ్యే ప్రమాదముంది. ఇది మరిన్ని సమస్యలకు కారణం కావొచ్చు. అందుకే ఆందోళనను గుర్తించటానికి అమెరికా పరిశోధకులు రక్త పరీక్షను రూపొందించారు. ఇది రక్తంలోని ఆర్‌ఎన్‌ఏ బయోమార్కర్ల ద్వారా ఆందోళనను గుర్తిస్తుంది. దీని ద్వారా ఆందోళన ముప్పును అంచనా వేయటమే కాదు, తీవ్రతనూ అంచనా వేయొచ్చు. తగిన మందులను ఎంచుకోవటానికీ తోడ్పడుతుంది. అనవసరంగా మందులు ఇవ్వకుండా కాపాడుతుంది. మందులకు బదులు ఆలోచనా తీరును మార్చే చికిత్సలు, జీవనశైలి మార్పులను సూచించటానికి వీలు కల్పిస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని