అబ్రకదబ్ర... హాంఫట్‌! ఉంగరం మాయం!

హాయ్‌ ఫ్రెండ్స్‌! మీకు మ్యాజిక్‌ చేయడం వచ్చా? రాకున్నా ఇబ్బంది లేదు. ఇప్పుడు నేర్చుకోండి. చిన్న చిన్న కిటుకులు తెలుసుకుంటే చాలు మనమూ అద్భుతమైన ఇంద్రజాల విద్యను ప్రదర్శించవచ్ఛు ఒకటికి రెండు సార్లు ప్రాక్టీస్‌ చేస్తే చాలు చక్కగా మ్యాజిక్‌ చేసేయొచ్ఛు మీరూ దీన్ని ప్రయత్నించండి మరి.

Published : 02 Apr 2020 00:56 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌! మీకు మ్యాజిక్‌ చేయడం వచ్చా? రాకున్నా ఇబ్బంది లేదు. ఇప్పుడు నేర్చుకోండి. చిన్న చిన్న కిటుకులు తెలుసుకుంటే చాలు మనమూ అద్భుతమైన ఇంద్రజాల విద్యను ప్రదర్శించవచ్ఛు ఒకటికి రెండు సార్లు ప్రాక్టీస్‌ చేస్తే చాలు చక్కగా మ్యాజిక్‌ చేసేయొచ్ఛు మీరూ దీన్ని ప్రయత్నించండి మరి.

కావాల్సినవి: ఉంగరం, రబ్బరు బ్యాండు, పిన్నీసు

ఇదిగోండి. ఈ ఫొటోలో ఉన్నట్టు వేలికి ఉంగరం పెట్టి చూపించాలి. కాసేపటికి మూసేయాలి. రెండు చేతులూ చూపించినా ఏ వేలుకీ ఉండదు. ఈ మ్యాజిక్‌ చూసినవాళ్లంతా ‘అరె! ఉంగరం ఏమయ్యిందబ్బా!’ అనుకోవాల్సిందే.


కిటుకు: ఈ ఫొటో చూస్తే కిటుకేంటో మీకే అర్థమవుతుంది. ఈ ఉంగరాన్ని రబ్బరుబ్యాండులో ఉంచి చివరన పిన్నీసు పెట్టి దాన్ని కనిపించకుండా చొక్కాకు పెట్టుకోవాలి. ఇతరులకు చూపించినప్పుడు ఉంగరం వేలుకే ఉంటుంది. అరచేతిని మూస్తూ ఉంగరాన్ని వాళ్లకు తెలియకుండా తీసేయగానే రబ్బరుతో వెనక్కి వెళ్లిపోతుందన్నమాట.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని