పెన్సిల్‌ ఇలా..అతుక్కుందెలా?

చేతులకు ఆకర్షణ శక్తి ఉంటుందా?! ఉండదు కదా! కానీ ఓ చిన్న ట్రిక్‌తో మన చేతులకు ఆకర్షణ శక్తి ఉందని మన ఫ్రెండ్స్‌ అందరినీ నమ్మించొచ్చు! పెన్సిల్‌, ఫోర్క్‌తో ఈ మ్యాజిక్‌ చేయడం ఎలానో మనం నేర్చుకుందామా!

Published : 14 Apr 2020 01:06 IST

చేతులకు ఆకర్షణ శక్తి ఉంటుందా?! ఉండదు కదా! కానీ ఓ చిన్న ట్రిక్‌తో మన చేతులకు ఆకర్షణ శక్తి ఉందని మన ఫ్రెండ్స్‌ అందరినీ నమ్మించొచ్చు! పెన్సిల్‌, ఫోర్క్‌తో ఈ మ్యాజిక్‌ చేయడం ఎలానో మనం నేర్చుకుందామా!

ముందుగా ఓ పెన్సిల్‌ తీసుకుని అరచేయి దానిపైన పెట్టండి.

* ఇప్పుడు అరచేతిని గాల్లోకి లేపండి.. పెన్సిల్‌ కూడా చేతికి అతుక్కుని గాల్లోకి లేస్తుంది.

* ఇందులో చిన్న కిటుకు ఉంది.

* పెన్సిల్‌ అతుక్కున్న చేతిని మణికట్టు దగ్గర పట్టుకున్న మరో చేతి దగ్గర అసలు రహస్యమంతా.. ఉంటుంది.

* పైన మణికట్టును పట్టుకున్నచేతి చూపుడు వేలితో పెన్సిల్‌ను పట్టుకోవాలి అంతే!

* ఇది మన స్నేహితులకు కనిపించకుండా జాగ్రత్త పడాలి.

* మన అరచేయి ఎట్టి పరిస్థితుల్లోనూ అవతలవారికి చూపించకూడదు.

* దీంతో వారికి ఇది ఎలా సాధ్యమైందో అర్థం కాదు.


అచ్చం ఇలాగే ఫోర్క్‌తోనూ చేయొచ్ఛు.

* మన చేతికి వాచీ ఉంటే మరో చేయి అవసరం లేకుండానే వాచీ కింద నుంచి మరో వస్తువును ఇలా చిత్రంలో చూపించినట్లు పెట్టి ఫోర్క్‌ లేదా పెన్సిల్‌ను పడిపోకుండా.. చేతికి అతుక్కున్నట్లు చూపించొచ్ఛు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని